అతడి వల్లే సెంచరీ బాదా.. చాలా హెల్ప్ చేశాడు: అశ్విన్

Ravichandran Ashwin Praises Ravindra Jadeja: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతితోనే కాదు.. బ్యాట్​తోనూ తాను ఎంత డేంజరస్ అనేది ప్రూవ్ చేశాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిపోయాడు అశ్విన్.

Ravichandran Ashwin Praises Ravindra Jadeja: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతితోనే కాదు.. బ్యాట్​తోనూ తాను ఎంత డేంజరస్ అనేది ప్రూవ్ చేశాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిపోయాడు అశ్విన్.

టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతితోనే కాదు.. బ్యాట్​తోనూ తాను ఎంత డేంజరస్ అనేది ప్రూవ్ చేశాడు. బాల్​ను గింగిరాలు తిప్పడమే కాదు.. బ్యాట్​ను కూడా మంత్రదండంలా మార్చి పరుగులు చేయగలనని అతడు మరోమారు నిరూపించాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిపోయాడు అశ్విన్. కఠిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి టీమ్​ను ఒడ్డున పడేశాడు. టీమ్ రెస్పాన్సిబిలిటీని భుజాల మీద వేసుకున్న వెటరన్ స్పిన్నర్.. తన అనుభవాన్ని రంగరించి ఆడాడు. 112 బంతుల్లో 102 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఒకదశలో 144 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న టీమ్​ను రవీంద్ర జడేజా (117 బంతుల్లో 86 నాటౌట్)తో కలసి ఆదుకున్నాడు. క్లాస్ ఇన్నింగ్స్​తో అలరించిన అశ్విన్.. సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు. అతడి హెల్ప్ వల్లే ఈ సెంచరీ సాధ్యమైందన్నాడు.

హోమ్ గ్రౌండ్ అయిన చెన్నైలో ఆడటం తనకు ఎప్పుడూ స్పెషల్ అని అన్నాడు అశ్విన్. చెపాక్ గ్రౌండ్​లో ఆడటం ఎంతో ఇష్టమన్న దిగ్గజ క్రికెటర్.. ఈ స్టేడియం తనకు ఎన్నో స్వీట్ మెమొరీస్​ను అందించిందన్నాడు. తాను చివరగా ఇక్కడ సెంచరీ బాదినప్పుడు రవిశాస్త్రి కోచ్​గా ఉన్నారని.. మళ్లీ ఇన్నాళ్లకు మూడంకెల స్కోరును అందుకోవడం ఆనందంగా ఉందన్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్​లో ఆడటం తన బ్యాటింగ్​కు బాగా హెల్ప్ అయిందన్నాడు అశ్విన్. ఈ సెంచరీలో జడేజా పాత్ర చాలా ఉందని.. అతడి వల్లే ఇది సాధ్యమైందన్నాడు. జడ్డూ సపోర్ట్​గా నిలిచాడని.. స్ట్రైక్ రొటేషన్​కు సంబంధించి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ముందుకు సాగేలా ఎంకరేజ్ చేశాడని తెలిపాడు అశ్విన్. మూడు రన్స్ తీసే చోట రెండు రన్స్ చాలని సరిపెట్టాడని.. దీని వల్ల కొంచెం అలసట తగ్గి తాను సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయగలిగానన్నాడు.

‘జడేజా లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నా ఇన్నింగ్స్​లో అతడి సహకారం ఎంతో ఉంది. మధ్యలో నేను అలసిపోయా. దీంతో చెమటలు పట్టేశాయి. అయితే జడేజా సపోర్ట్​గా ఉంటూ గైడ్ చేశాడు. మూడు రన్స్ వచ్చే దగ్గర రెండు చాలు అని సరిపెట్టాడు. దీంతో అలసట తగ్గి ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లా. జడ్డూకు థ్యాంక్స్. అతడు మా టీమ్​లోని బెస్ట్ బ్యాటర్స్​లో ఒకడు. అతడి హెల్ప్​ మర్చిపోలేను’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. శుక్రవారం పిచ్ ఎలా స్పందిస్తుందో తాను చెప్పలేనన్నాడీ దిగ్గజ క్రికెటర్. అయితే బౌన్స్​తో పాటు కాస్త స్పిన్​కు అనుకూలించే ఛాన్స్ ఉందన్నాడు. బ్యాటింగ్ మీద చాన్నాళ్లుగా పని చేస్తున్నానని తెలిపాడు. అది వర్కౌట్ అయిందన్నాడు. రిషబ్ పంత్ మాదిరిగా పాజిటివ్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. మరి.. అశ్విన్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments