టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. విండీస్ పర్యటనలో భాగంగా.. విండ్సర్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. విండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో సత్తా చాటగా.. జడేజా మూడు వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజ్ లో అరంగేట్ర ప్లేయర్ యశస్వీ జైస్వాల్(40), కెప్టెన్ రోహిత్ శర్మ (30) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే టీమిండియా యంగ్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు వెంటరన్ స్పిన్నర్ అశ్విన్. అతడిలాంటి చురుకైన ఆటగాడిని నేనింతవరకు చూడలేదని కితాబిచ్చాడు.
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా విజృంభిస్తోంది. తొలుత బౌలింగ్ లో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిన టీమిండియా.. తర్వాత బ్యాటింగ్ లో సైతం దుమ్మురేపింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడం ద్వారా అశ్విన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఓ యంగ్ క్రికెటర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఈ స్టార్ స్పిన్నర్. ఆ యంగ్ క్రికెటర్ ఎవరో కాదు.. ఈ సిరీస్ తోనే టీమిండియాలోకి అరంగేట్రం చేసిన యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్. ఇక అతడి ఇన్నింగ్స్ విండీస్ జట్టుకు వార్నింగ్ లాంటిదని చెప్పుకొచ్చాడు అశ్విన్.
ఇక జైస్వాల్ గురించి అశ్విన్ మాట్లాడుతూ..”యశస్వీ జైస్వాల్ లాంటి చురుకైన, తెలివైన ఆటగాడిని నేను ఇంతవరకు చూడలేదు. అతడి బ్యాటింగ్ శైలిని చూస్తే.. కెరీర్ లో ఎన్నో ఘనతలు కచ్చితంగా సాధిస్తాడని నమ్ముతున్నా. ఇక అతడి నుంచి మనం భవిష్యత్ లో చాలా గొప్ప ప్రదర్శనలు చూడబోతున్నాం” అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. కాగా.. జైస్వాల్ కూడా ఇటీవల జరిగిన ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు. దాంతో సెలక్టర్ల కన్ను అతడిపై పడింది. అదీకాక గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వస్తూ.. సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.
ఇదికూడా చదవండి: విరాట్ కోహ్లీని టీజ్ చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్..