Ravichandran Ashwin: సూపర్ సెంచరీ.. ధోని రికార్డు సమం చేసిన అశ్విన్

Ravichandran Ashwin equaled MS Dhoni Record: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పడంతో పాటుగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును సమం చేశాడు.

Ravichandran Ashwin equaled MS Dhoni Record: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పడంతో పాటుగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును సమం చేశాడు.

చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన బ్యాటింగ్ తో దమ్మురేపాడు. విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, కేెఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు విఫలం అయిన చోట సెంచరీతో అదరగొట్టాడు. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర జడేజాతో(86 నాటౌట్) కలిసి పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సరసన చేరాడు.

రవిచంద్రన్ అశ్విన్.. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా పాలిట ఆపద్భాంధవుడిలా నిలిచాడు. బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ దాటికి  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్ ఇలా క్రీజ్ లోకి వచ్చి అలా వెళ్లిపోయారు. దాంతో 144 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అవుతుందా? అన్న సందేహం ప్రేక్షకుల్లో కలిగేలా చేసింది. ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాట్ తో మరోసారి టీమిండియా పాలిట దేవుడిలా మారాడు. మరో ప్లేయర్ రవీంద్ర జడేజా(117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 86 బ్యాటింగ్) కలిసి ఏడో వికెట్ కు అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 102 అజేయ సెంచరీ నమోదు చేశాడు అశ్విన్.

కాగా.. అశ్విన్ కెరీర్ లో ఇది 6వ టెస్ట్ సెంచరీ. ఇక ఈ శతకం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును సమం చేసి, అతడి సరసన నిలిచాడు. ధోని సైతం టెస్టుల్లో 6 శతకాలు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును అశ్విన్ సమం చేశాడు. అదీకాక ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే? ధోని కంటే ఎక్కువ ఓవర్సీస్ సెంచరీలు ఈ స్టార్ స్పిన్నర్ నమోదు చేశాడు. స్వదేశంలో 4, విండీస్ గడ్డపై 2 సెంచరీలు బాదాడు ఈ వెటరన్ ప్లేయర్. ధోని మాత్రం భారత గడ్డపై 5, పాకిస్థాన్ లో ఓ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం అద్భుత బ్యాటింగ్ చేస్తున్న అశ్విన్ డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యం లేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది. క్రీజ్ లో అశ్విన్(102*), జడేజా(86*) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ 4 వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టాడు. మరి తన వీరోచిత బ్యాటింగ్ తో సెంచరీ సాధించడమే కాకుండా.. ధోని రికార్డును అశ్విన్ సమం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments