Somesekhar
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. దీంతో 45 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. దీంతో 45 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఇంగ్లాండ్ తో వైజాగ్ వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు సంధిస్తూ.. క్రమంగా వికెట్లు పడగొడుతున్నారు. భారీ భాగస్వామ్యాలను నెలకొల్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ వికెట్ పడగొట్టడం ద్వారా 45 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు అశ్విన్. మరి ఆ రికార్డు ఏంటి? ఆ వివరాలు చూద్దాం పదండి.
రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లను తన స్పిన్ తో కట్టడి చేస్తూ.. టీమిండియాకు విజయాన్ని అందించేందుకు ముందుకుసాగుతున్నాడు. ఈ క్రమంలోనే వైజాగ్ టెస్ట్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ గత మ్యాచ్ సెంచరీ హీరో ఓలీ పోప్ ను అశ్విన్ అవుట్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో అతడు పెవిలియన్ చేరాడు. దీంతో అశ్విన్ ఖాతాలో అరుదైన ఫీట్ వచ్చి చేరింది. ఈ వికెట్ పడగొట్టడం ద్వారా 45 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు ఈ వెటరన్ బౌలర్. ఈ వికెట్ తో ఇప్పటి వరకు ఇంగ్లాండ్ పై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఘనతకెక్కాడు.
ఇప్పటి వరకు ఇంగ్లాండ్ పై టెస్టుల్లో 96 వికెట్లు తీశాడు అశ్విన్. దీంతో టీమిండియా మాజీ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అతడు 1964-79 కాలంలో క్రికెట్ ఆడిన అతడు ఇంగ్లాండ్ పై టెస్టుల్లో 95 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టాడు అశ్విన్. ఇక ఈ లిస్ట్ లో అనిల్ కుంబ్లే(92), బిషన్ సింగ్ బేడీ(85), కపిల్ దేవ్(85) వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా.. మరికొన్ని రికార్డులకు చేరువలో ఉన్నాడు ఈ స్టార్ స్పిన్నర్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసి, విజయానికి 137 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్. క్రీజ్ లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్(30), టామ్ హార్ట్లీ(27) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి అశ్విన్ 45 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: Shubman Gill: వార్నింగ్‌తో ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడిన గిల్! ఇంత కథ నడిచిందా?