ఆస్పత్రి బెడ్​పై స్టార్ క్రికెటర్.. అతడికి ఏమైంది?

ఎంతగానో ఆరాధించే క్రికెటర్లకు ఏమైనా అయితే అభిమానులు తట్టుకోలేరు. వాళ్లు బాధలో ఉంటే భరించలేరు. అందులో నుంచి త్వరగా బయటపడాలని, తిరిగి ఎప్పటిలాగే ఆటతో తమను అలరించాలని కోరుకుంటారు.

ఎంతగానో ఆరాధించే క్రికెటర్లకు ఏమైనా అయితే అభిమానులు తట్టుకోలేరు. వాళ్లు బాధలో ఉంటే భరించలేరు. అందులో నుంచి త్వరగా బయటపడాలని, తిరిగి ఎప్పటిలాగే ఆటతో తమను అలరించాలని కోరుకుంటారు.

ఎంతగానో ఆరాధించే క్రికెటర్లకు ఏమైనా అయితే అభిమానులు తట్టుకోలేరు. వాళ్లు బాధలో ఉంటే భరించలేరు. అందులో నుంచి త్వరగా బయటపడాలని, తిరిగి ఎప్పటిలాగే ఆటతో తమను అలరించాలని కోరుకుంటారు. ఇతర దేశాల్లో ఏమోగానీ భారత ఉపఖండంలో మాత్రం క్రికెటర్లకు నెక్స్ట్‌ లెవల్​లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆటగాళ్లను ఇక్కడ దేవుళ్లలా కొలుస్తుంటారు. వాళ్లు చేసే ప్రతి పనిని ఫాలో అవుతుంటారు. ప్లేయర్ల ఫెయిల్యూర్​లోనూ ఫ్యాన్స్ అండగా ఉంటారు. అలాంటిది వాళ్లకు ఏమైనా అయిందంటే మాత్రం తట్టుకోలేరు. తాజాగా ఓ ప్లేయర్ విషయంలో అభిమానులు ఇలాగే టెన్షన్ పడుతున్నారు.

భీకరమైన వేగంతో బంతులు వేస్తూ మంచి పేసర్​గా పేరు తెచ్చుకున్నాడు ఆఫ్ఘానిస్థాన్ బౌలర్ నవీనుల్ హక్. ఆఫ్ఘాన్ తరఫున కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడటం ద్వారానే అతడు ఎక్కువ పేరు సంపాదించాడు. ఐపీఎల్​లో లక్నో జట్టు తరఫున మంచి ప్రదర్శనలు ఇస్తూ ఫ్యాన్స్ మనసులు దోచుకున్నాడు. అలాంటోడు తాజాగా ఆస్పత్రి పాలయ్యాడు. గాయంతో బాధపడుతున్న అతడు తాజాగా సర్జరీ చేయించుకున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని అతడి సహచర క్రికెటర్, ఆఫ్ఘానిస్థాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ తెలిపాడు. హాస్పిటల్ బెడ్​పై మ్యాంగో మ్యాన్ ఉన్న ఫొటోను రషీద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

నవీనుల్ హక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రషీద్ ఖాన్ ఓ పోస్ట్ పెట్టాడు. త్వరగా రికవర్ అయి వచ్చెయ్ అని అన్నాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. అంతా సమసిపోతుందని రషీద్ తన పోస్ట్​లో రాసుకొచ్చాడు. ‘గెట్ వెల్ సూన్ మష్రా’ ఆ పోస్ట్​కు క్యాప్షన్ ఇచ్చాడు. రషీద్-నవీన్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆఫ్ఘాన్ మ్యాచుల్లో ఇది కనిపిస్తూనే ఉంటుంది. మ్యాంగ్ మ్యాన్​తో ఉన్న స్నేహం కారణంగానే అతడు ఆస్పత్రిలో ఉండటంతో త్వరగా కోలుకోవాలని రషీద్ పోస్ట్ పెట్టాడు. దీన్ని చూసిన క్రికెట్ లవర్స్ నవీన్ త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నారు. అతడు మళ్లీ బాల్​తో మ్యాజిక్ చేస్తే చూడాలని ఉందని అంటున్నారు. ఇక, 27 సెప్టెంబర్, 2023న వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు నవీన్. అయితే టీ20ల్లో మాత్రం అతడు కంటిన్యూ అవుతున్నాడు. ఇటీవల జరిగిన పొట్టి ప్రపంచ కప్​లోనూ అతడు ఆఫ్ఘాన్ తరఫున బరిలోకి దిగాడు.

Show comments