iDreamPost
android-app
ios-app

వీడియో: SRH vs GT మ్యాచ్‌లో ఎవ్వరూ గుర్తించని అద్భుతం! చూస్తే వావ్‌ అనాల్సిందే..

  • Published Apr 01, 2024 | 4:43 PM Updated Updated Apr 01, 2024 | 4:43 PM

Rashid Khan, SRH vs GT, IPL 2024: ఐపీఎల్‌ అంటేనే సంచలనాలుకు నెలవు. అలాంటి ఈ లీగ్‌లో రోజుకో అద్భుతం జరుగుతుంటే.. ప్రతి సూపర్‌ క్యాచ్‌ కూడా చాలా సాధారణం అనిపిస్తోంది. అయితే.. ఈ క్యాచ్‌ సూపర్‌కే సూపర్‌. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Rashid Khan, SRH vs GT, IPL 2024: ఐపీఎల్‌ అంటేనే సంచలనాలుకు నెలవు. అలాంటి ఈ లీగ్‌లో రోజుకో అద్భుతం జరుగుతుంటే.. ప్రతి సూపర్‌ క్యాచ్‌ కూడా చాలా సాధారణం అనిపిస్తోంది. అయితే.. ఈ క్యాచ్‌ సూపర్‌కే సూపర్‌. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Apr 01, 2024 | 4:43 PMUpdated Apr 01, 2024 | 4:43 PM
వీడియో: SRH vs GT మ్యాచ్‌లో ఎవ్వరూ గుర్తించని అద్భుతం! చూస్తే వావ్‌ అనాల్సిందే..

ఐపీఎల్‌లో బ్యాటింగ్‌ విధ్వంసాలే కాకుండా ఫీల్డింగ్‌ అద్భుతాలు కూడా చాలా జరుగుతున్నాయి. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లో ఓ సంచలన క్యాచ్‌ అందుకున్నాడు ఓ ఆటగాడు. ఆ క్యాచ్‌ చూస్తే.. సగటు క్రికెట్‌ అభిమాని అయినా కూడా వావ్‌ ఏం పట్టాడు రా అని అనాల్సిందే. ఆ క్యాచ్‌ పట్టిన ఫీల్డర్‌ను మెచ్చుకోవాల్సిందే. ఆ క్యాచ్‌ అలాంటి మరి. అయితే.. ఇంతకీ ఆ క్యాచ్‌ పట్టింది ఎవరనుకుంటున్నారు.. గతంలో సన్‌రైజర్స్‌కు వెన్నుముకగా నిలిచి రషీద్‌ ఖాన్‌. ఐపీఎల్‌ 2022 వరకు ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఆడిన రషీద్‌ ఖాన్‌.. తాజా మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు వ్యతిరేకంగా ఈ సూపర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

ఆ క్యాచ్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన​ ఎడెన్‌ మార్కరమ్‌ పెవిలియన్‌ బాట పట్టాల్సి వచ్చింది. తన సూపర్‌ బౌలింగ్‌తో వికెట్లు తీయడమే కాదు.. ఫీల్డింగ్‌తో కూడా ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్‌కు పంపుతానంటూ రషీద్‌ ఖాన్‌ చెప్పకనేచెప్పాడు. ఉమేష్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ నాలుగో బంతికి మార్కరమ్‌ డీప్‌ కవర్స్‌లోకి భారీ షాట్‌ ఆడాడు. ఆ బాల్‌ను వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి.. భారీ డైవ్‌ కొట్టి.. కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నా రషీద్‌ ఖాన్‌. ఆ క్యాచ్‌ చూసి.. వామ్మో ఏం పట్టాడు రా బాబు అంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రషీద్‌ పట్టిన ఆ క్యాచ్‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 29, క్లాసెన్‌ 24, అబ్దుల్‌ సమద్‌ 14 బంత్లులో 29 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్‌ చేయగలిగింది ఎస్‌ఆర్‌హెచ్‌. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ 3 వికెట్లతో రాణించాడు. ఇక 163 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది గెలుపొందింది. సాహా 25, శుబ్‌మన్‌ గిల్‌ 36, సాయి సుదర్శన్‌ 45, డేవిడ్‌ మిల్లర్‌ 44 పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌, మయాంక్‌ మార్కండె, ప్యాట్‌ కమిన్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. మరి కిందున్న వీడియో చూసి రషీద్‌ ఖాన్‌ పట్టిన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.