iDreamPost
android-app
ios-app

హెలికాప్టర్‌ షాట్లతో రెచ్చిపోయిన రషీద్ ఖాన్‌! ఒకే ఓవర్‌లో..

  • Published Aug 21, 2024 | 3:38 PM Updated Updated Aug 21, 2024 | 3:38 PM

Rashid Khan, Amo Sharks, Shpageeza Cricket League: టీ20 క్రికెట్‌లో మోస్ట్‌ డేంజరస్‌ బౌలర్‌గా ఉన్న రషీద్‌ ఖాన్‌.. బ్యాట్‌తో కూడా అదరగొడతాడనే విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ సూపర్‌ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rashid Khan, Amo Sharks, Shpageeza Cricket League: టీ20 క్రికెట్‌లో మోస్ట్‌ డేంజరస్‌ బౌలర్‌గా ఉన్న రషీద్‌ ఖాన్‌.. బ్యాట్‌తో కూడా అదరగొడతాడనే విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ సూపర్‌ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 21, 2024 | 3:38 PMUpdated Aug 21, 2024 | 3:38 PM
హెలికాప్టర్‌ షాట్లతో రెచ్చిపోయిన రషీద్ ఖాన్‌! ఒకే ఓవర్‌లో..

ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ బ్యాట్‌తో రెచ్చిపోయాడు.. రషీద్‌ ఖాన్‌ అనగానే వికెట్లు తీసే మ్యాజికల్‌ స్పిన్నర్‌గానే చాలా మందికి తెలుసు కానీ, గత కొంతకాలంగా బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు రషీద్‌ భాయ్‌. టీ20 క్రికెట్‌లో మోస్ట్‌ డేంజరస్‌ బౌలర్‌గా ఎదిగిన రషీద్‌.. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని టీ20 లీగ్స్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా.. తన సొంత దేశం ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న ష్పగీజా క్రికెట్‌ లీగ్‌లోనూ రషీద్‌ తన బ్యాట్‌ పవరేంటో చూపించాడు.

స్పగీజా క్రికెట్‌ లీగ్‌లో స్పీన్‌ఘర్‌ టైగర్స్‌ తరఫున ఆడుతున్న రషీద్‌ ఖాన్‌.. అమో షార్క్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. వర్షం కారణంగా స్పీన్‌ఘర్‌ టైగర్స్‌ జట్టుకు 12 ఓవర్లలో 139 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించాడు. ఈ టార్గెట్‌ను ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన టైగర్స్‌ జట్టు.. కేవలం 20 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు కెప్టెన్‌ రషీద్ ఖాన్‌.. సంచనల బ్యాటింగ్‌తో స్పీన్‌ఘర్‌ టైగర్స్‌ టీమ్‌ పరువు కాపాడాడు. నో లుక్‌ షాట్స్‌, హెలికాప్టర్‌ షాట్లతో విధ్వంసం సృష్టించాడు.

అతను ఉన్నంత సేపు టైగర్స్‌ జట్టు.. టార్గెట్‌ దిశగా దూసుకెళ్లింది. 20 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి.. స్వల్ప స్కోర్‌కు ఆలౌట్‌ అయ్యే ప్రమాదంలో ఉన్న జట్టు.. రషీద్‌ తన బ్యాట్‌తో రక్షించాడు. ఫోర్లు సిక్సులతో విరుచుకుపడిన రషీద్‌.. కేవలం 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. మొత్తంగా 26 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 53 పరుగులు చేసి రాణించాడు. అయితే.. రషీద్‌ కంటే ముందు టైగర్స్‌ ఇన్నింగ్స్‌ ఎలా కోలాప్స్‌ అయిందో.. రషీద్‌ ఖాన్‌ అవుటైన తర్వాత మళ్లీ అలాగే కోలాప్స్‌ అయింది. ఇక్రమ్‌ ఒక్కడే 23 బంతుల్లో 31 పరుగులు చేసి రాణించాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. మరి ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.