వీడియో: స్టార్‌ బ్యాటర్లు విఫలమైనా.. విధ్వంసం సృష్టించిన రషీద్‌ ఖాన్‌! 24 బంతుల్లోనే..

Rashid Khan, MLC 2024,Texas Super Kings vs MI New York: రషీద్‌ ఖాన్‌ అంటే స్టార్‌ స్పినర్‌ అనే అనుకుంటారు.. కానీ, అతను అప్పుడప్పుడు తనలోని విధ్వంసకర బ్యాటర్‌ను నిద్రలేపుతుంటాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు..

Rashid Khan, MLC 2024,Texas Super Kings vs MI New York: రషీద్‌ ఖాన్‌ అంటే స్టార్‌ స్పినర్‌ అనే అనుకుంటారు.. కానీ, అతను అప్పుడప్పుడు తనలోని విధ్వంసకర బ్యాటర్‌ను నిద్రలేపుతుంటాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు..

ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో టాస్‌ క్లాస్‌ బౌలర్‌గా ఉన్నాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌తో పాటు ప్రపంచంలో ఏ మూల ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ జరిగినా రషీద్‌ ఖాన్‌ కనపిస్తాడు. అద్భుతమైన స్పిన్‌ బౌలింగ్‌తో పాటు.. అప్పుడప్పుడు బ్యాట్‌తో కూడా చెలరేగిపోతుంటాడు ఈ మోట్రన్‌ క్రి​కెటర్‌. తాజాగా మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ విధ్వంసం సృష్టించాడు. ఎంఐ న్యూయార్క్‌ స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట.. రషీద్‌ ఖాన్‌ ఫోర్లు సిక్సులతో చెలరేగాడు.

షెఫర్డ్‌, పొలార్డ్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్ల కంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు.. ఐదు స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రషీద్‌ ఖాన్‌.. సంచలన బ్యాటింగ్‌తో సూపర్‌ కింగ్స్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డెవాల్డ్‌ బ్రెవిస్‌, నికోలస్‌ పూరన్‌, షెఫర్డ్‌, పొలార్డ్‌ లాంటి బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై రషీద్‌ అదరగొట్టాడు. కేవలం 24 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 55 పరుగులు చేసి.. ఎంఐ న్యూయార్క్‌ టీమ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే.. రషీద్‌ ఖాన్‌ కష్టానికి ఫలితం దక్కలేదు. రషీద్‌ ఖాన్‌కు పెద్దగా సపోర్ట్‌ లభించకపోవడంతో ఎంఐ సెట్‌ చేసిన టార్గెట్‌ను సూపర్‌ కింగ్స్‌ ఛేజ్‌ చేసి గెలింది.

మ్యాచ్‌ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ న్యూయార్క్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రషీద్‌ ఖాన్‌ 55, మోనాక్‌ పటేల్‌ 41 బంతుల్లో 44 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో స్టోయినీస్‌, ఆరోన్‌ రెండేసి వికెట్లతో రాణించారు. ఇక 164 పరుగుల టార్గెట్‌ను టెక్కాస్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టు సులువుగా ఛేదించింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వె 51, ఫాఫ్‌ డుప్లెసిస్‌ 72 పరుగులతో చెలరేగాడంతో తొలి వికెట్‌కు ఏకంగా 101 పరుగులు జోడించారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆరోన్‌ సైతం 40 పరుగులతో రాణించడంతో.. 18.3 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో ఎంఐ ఓడిపోయినా.. రషీద్‌ ఖాన్‌ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతని ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments