T20 World Cup: న్యూజిలాండ్‌ కొంపముంచిన ఆ ముగ్గురు! 9 మంది సింగిల్‌ డిజిట్‌కే..

Rashid Khan, Rahmanullah Gurbaz, Fazalhaq Farooqi, AFG vs NZ: న్యూజిలాండ్‌కు ఘోర అవమానం జరిగింది. టీ20 వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో ఓడిపోయింది. అయితే.. కివీస్‌ను ఓ ముగ్గురు ఆటగాళ్లు ముంచేశారు. వాళ్లు ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం..

Rashid Khan, Rahmanullah Gurbaz, Fazalhaq Farooqi, AFG vs NZ: న్యూజిలాండ్‌కు ఘోర అవమానం జరిగింది. టీ20 వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో ఓడిపోయింది. అయితే.. కివీస్‌ను ఓ ముగ్గురు ఆటగాళ్లు ముంచేశారు. వాళ్లు ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం..

అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడకు మారుపేరు న్యూజిలాండ్‌ జట్టు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్స్‌లో కివీస్‌ జట్టు సంచలనాలకు అస్సలు తావు ఇవ్వదు, మినిమమ్‌ గ్యారెంటీ టీమ్‌గా సెమీస్‌ వరకు వెళ్తుందనే టాక్ ఉంది. కానీ, ఈ సారి లెక్క మారింది. అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్త వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ చేతుల్లో ఓడిపోయింది. అది కూడా అత్యంత ఘోరంగా. ఆఫ్ఘాన్‌కు అసలు ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా చిత్తు చిత్తుగా చేతులెత్తేసింది. 160 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేక.. కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఇంత చెత్త ఓడేందుకు ఓ ముగ్గురు క్రికెటర్లు కారణం అయ్యారు. ఆ ముగ్గురు ఎవరు? ఏం చేశారో ఇప్పుడు చూద్దాం..

ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లను తప్పుపట్టడం కన్నా.. ఆఫ్ఘాన్‌ ఆటగాళ్లను మెచ్చుకోవడమే కరెక్ట్‌. ఈ మ్యాచ్‌ను ఆఫ్ఘాన్‌ తమ బలంతో, అద్భుతమైన ఆటతోనే గెలిచింది. పైగా న్యూజిలాండ్‌లో ఇద్దరో, ముగ్గురో కాదు.. టీమ్‌ మొత్తం విఫలమైంది. ఏకంగా 9 మంది ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే అవుట్‌ అయ్యారు. అయితే.. ఆఫ్ఘాన్‌లోని ఓ ముగ్గురు ఆటగాళ్లు మాత్రం న్యూజిలాండ్‌ను దారుణంగా దెబ్బ కొట్టారని చెప్పవచ్చు. అందులో మొదటి వాడు.. ఆఫ్ఘాన్‌ ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌. ఈ ఓపెనర్‌ ‍న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, హెన్రీలను సమర్థవంతంగా ఎదుర్కొని అద్భుతమమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 80 పరుగులు చేసి.. మరో ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా సెంచరీ భాగస్వామ్యం అందించాడు.

బ్యాటింగ్‌లో గుర్బాజ్‌, ఇబ్రహీం తప్ప ఎవరూ పెద్ద రన్స్‌ చేయలేదు. గుర్బాజ్‌ కష్టానికి ఫలితం చూపించారు.. స్టార్‌ బౌలర్లు రషీద్‌ ఖాన్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీ. కివీస్‌ టాపార్డర్‌ను ఫరూఖీ కుప్పకూల్చాడు. ఫిన్ అలెన్‌, డెవాన్‌ కాన్వె, డార్లీ మిచెల్‌లను సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పెవిలియన్‌ చేర్చాడు. ఫరూఖీ అందించిన ఈ సూపర్‌ స్టార్ట్‌ను కొనసాగిస్తూ.. రషీద్‌ ఖాన్‌ కూడా తన మ్యాజికల్‌ స్పిన్‌తో రెచ్చిపోయాడు. కేన్‌ విలియమ్సన్‌, మార్క్ చాప్మన్, బ్రెస్‌వెల్‌, ఫెర్గుసన్‌లను అవుట్‌ చేశాడు. మొత్తంగా ఫరూఖీ, రషీద్‌ ఖాన్‌ చెరో నాలుగేసి వికెట్లు తీసి.. న్యూజిలాండ్‌ను 75 పరుగులకే కుప్పకూల్చారు. ఈ ఇద్దరికి నబీ 2 వికెట్లతో మంచి సహకారం అందించాడు. మొత్తంగా.. న్యూజిలాండ్‌ను గుర్బాజ్‌, ఫరూఖీ, రషీద్‌ ఖాన్‌ కలిసి.. చిత్తుగా ఓడించారు. మరి కివీస్‌పై ఆఫ్ఘాన్‌ సాధించిన విజయంలో ఈ ముగ్గురి పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments