iDreamPost

T20 World Cup: స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ పరువుతీసిన PNG బ్యాటర్లు!

  • Published Jun 14, 2024 | 1:14 PMUpdated Jun 14, 2024 | 1:14 PM

Rashid Khan, AFG vs PNG, T20 World Cup 2024: పీఎన్‌జీతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌ గెలిచినా.. రషీద్‌ ఖాన్‌ మాత్రం పరువుతీసుకున్నాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Rashid Khan, AFG vs PNG, T20 World Cup 2024: పీఎన్‌జీతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌ గెలిచినా.. రషీద్‌ ఖాన్‌ మాత్రం పరువుతీసుకున్నాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 14, 2024 | 1:14 PMUpdated Jun 14, 2024 | 1:14 PM
T20 World Cup: స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ పరువుతీసిన PNG బ్యాటర్లు!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా పీఎన్‌జీ(పాపువా న్యూ గినియా)తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్‌ సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయింది. సూపర్‌ 8లో ఇండియాతో తలపడనుంది ఆఫ్ఘనిస్థాన్‌. అయితే.. పీఎన్‌జీతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌ విజయం సాధించినా.. ఆ జట్టు కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌కు ఘోర అవమానం జరిగింది. పీఎన్‌జీ బ్యాటర్లు రషీద్‌ను దారుణంగా అవమానించారని చెప్పవచ్చు. మ్యాచ్‌ గెలిచిన సంతోషంలో అది పెద్దగా హైలెట్‌ కాకపోవచ్చు కానీ.. టీ20 క్రికెట్‌లో మోస్ట్‌ డేంజరస్‌ బౌలర్‌గా ఉన్న రషీద్‌ ఖాన్‌కు ఇది కచ్చితంగా అవమానమే. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ మ్యాచ్‌లో పీఎన్‌జీని ఆఫ్ఘనిస్థాన్‌కే 95 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 19.5 ఓవర్లలో పీఎన్‌జీ కేవలం 95 రన్స్‌ చేసిన కుప్పకూలింది. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో ఏ జట్టు అయినా ఆలౌట్‌ అయింది అంటే.. కచ్చితంగా రషీద్‌ ఖాన్‌ తన మ్యాజిక్‌ చూపించి ఉండటాడని అనుకుంటారు. కానీ, ఇక్కడ మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది. రషీద్‌ ఖాన్‌ తన మ్యాజిక్‌ చూపించలేదు సరికదా.. ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. ఇది నిజంగా రషీద్‌ ఖాన్‌కు అవమానంగానే భావించాలి. వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌గా ఉన్న రషీద్‌.. పీఎన్‌జీ లాంటి ఒక పసికూన టీమ్‌పై ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం గమనార్హం.

పైగా రషీద్‌ ఖాన్‌ తన పూర్తి కోటా ఓవర్లు వేశాడు. 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. ఆఫ్ఘాన్‌ బౌలర్లలో ఫారూఖీ 3, నవీన్‌ ఉల్‌ హక్‌ 2, నూర్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. మిగతావి రనౌట్లు. మరో విషయం ఏంటంటే.. ప్రపంచ క్రికెట్‌లో హేమాహేమీ బ్యాటర్లను వణికించిన రషీద్‌ ఖాన్‌.. పీఎన్‌జీపై 6.20 ఎకానమీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌ బౌలర్లలో ఇదే సెకండ్‌ హ్యయెస్ట్‌. నబీ ఒక ఓవర్‌లో 9 పరుగులు ఇవ్వడంతో అతనిది 9 ఎనాకమీగా ఉంది. ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేసి.. రషీద్‌ ఖాన్‌కు వికెట్‌ లేకపోవడంపై క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా రషీద్‌ ఖాన్‌ను పీఎన్‌జీ బ్యాటర్లు చాలా ఈజీగా ఎదుర్కొని.. అతని 4 ఓవర్లలో 25 పరుగులు చేసి.. బాల్‌ ఏ రన్‌ చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి