Rashid Khan: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రషీద్ ఖాన్ ఆల్ టైమ్ రికార్డ్! ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్..

Rashid Khan: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రషీద్ ఖాన్ ఆల్ టైమ్ రికార్డ్! ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ప్రపంచ రికార్డును సృష్టించాడు ఆఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ప్రపంచ రికార్డును సృష్టించాడు ఆఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024 సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఇప్పటికే అమెరికా పాకిస్తాన్ కు షాకివ్వగా.. తాజాగా పటిష్టమైన న్యూజిలాండ్ ను దెబ్బకొట్టింది పసికూన ఆఫ్గానిస్తాన్. 160 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక కేవలం 75 రన్స్ కే ఆలౌట్ అయ్యింది కివీస్. ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఫామ్ లోకి వచ్చిన రషీద్ ను చూసి ప్రత్యర్థులు వణికిపోతున్నారు.

రషీద్ ఖాన్.. ఈ ఐపీఎల్ సీజన్ లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ టీ20 వరల్డ్ కప్ కు వచ్చేసరికి ఫామ్ లోకి వచ్చాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గాన్ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ రషీద్ ఖాన్. ఈ మ్యాచ్ లో తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. కేన్ విలియమ్సన్, చాంప్మన్, పెర్గ్యూసన్, బ్రేస్ వెల్ వికెట్లను తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పొట్టి ప్రపంచ కప్ హిస్టరీలోనే అల్ టైమ్ రికార్డ్ ను తన  ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలను(4/17) నమోదు చేసిన కెప్టెన్ గా రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజ ఆల్ రౌండర్ డానియల్ వెట్టోరీ పేరిట ఉండేది. అతడు టీమిండియాపై 2007 టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా వ్యవహరిచిన అతడు.. 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక వెట్టోరీతో సమంగా నిలిచాడు ఒమన్ కెప్టెన్ జీషన్ మసూద్ పుపువా న్యుగీనియాపై 20 రన్స్ కు 4 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డును కివీస్ తో జరిగిన తాజా మ్యాచ్ లో బద్దలు కొట్టాడు రషీద్ ఖాన్.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ కు చుక్కలు చూపించారు ఆఫ్గాన్ బౌలర్లు. దాంతో 15.2 ఓవర్లలో కేవలం 75 రన్స్ కే ఆలౌట్ చేసింది. రషీద్, ఫారుఖీ తలా 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ నబీ 2 వికెట్లు కూల్చాడు. మరి టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన రషీద్ ఖాన్.. ఈ వరల్డ్ కప్ లో రాబోయే మ్యాచ్ ల్లో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. ఫామ్ లోకి వచ్చి.. ప్రత్యర్థి బ్యాటర్లకు డేంజర్ బెల్స్ పంపించాడు.

Show comments