iDreamPost
android-app
ios-app

Zaheer Khan: బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్.. ఒకప్పుడు స్పిన్ వేశాడని మీకు తెలుసా? వీడియో వైరల్..

  • Published May 08, 2024 | 4:16 PM Updated Updated May 08, 2024 | 4:31 PM

ఎప్పుడూ ఫాస్ట్ బౌలింగ్ వేసే జహీర్.. ఓసారి స్పిన్ వేశాడని మీకు తెలుసా? అతడు స్పిన్  బౌలింగ్ వేసిన ఓల్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియోను మీరు చూసేయండి.

ఎప్పుడూ ఫాస్ట్ బౌలింగ్ వేసే జహీర్.. ఓసారి స్పిన్ వేశాడని మీకు తెలుసా? అతడు స్పిన్  బౌలింగ్ వేసిన ఓల్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియోను మీరు చూసేయండి.

Zaheer Khan: బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్.. ఒకప్పుడు స్పిన్ వేశాడని మీకు తెలుసా? వీడియో వైరల్..

జహీర్ ఖాన్.. టీమిండియా దిగ్గజ బౌలర్లలో ఒకడు. తన పదునైన పేస్, స్వింగ్ బౌలింగ్ తో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించేవాడు. ఎంతటి దిగ్గజ బ్యాటర్ అయినా జహీర్ బౌలింగ్ ఎదుర్కొవాల్సింది అంటే భయపడాల్సిందే. తన పేస్ బౌలింగ్ తో టీమిండియాకు తిరుగులేని విజయాలను అందించాడు. అయితే ఎప్పుడూ ఫాస్ట్ బౌలింగ్ వేసే జహీర్.. ఓసారి స్పిన్ వేశాడని మీకు తెలుసా? అతడు స్పిన్  బౌలింగ్ వేసిన ఓల్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియోను మీరు చూసేయండి.

అది 2002 అంటిగ్వా వేదికగా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎన్నో వింతలు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వెస్టిండీస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఎప్పుడూ ఫాస్ట్ బౌలింగ్ వేసే టీమిండియా దిగ్గజం జహీర్ ఖాన్ స్పిన్ వేశాడు. కొద్దిలో వికెట్ తీసుకునేవాడే కానీ కుదరలేదు. ఈ ఓల్డ్ అన్ సీన్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దాంతో జహీర్ ఖాన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్పిన్ కూడా బాగా వేస్తున్నారు.. అలాగే కంటిన్యూ ఎందుకు కాలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక జహీర్ కెరీర్ విషయానికి వస్తే.. 92 టెస్టుల్లో 311 వికెట్లు, 200 వన్డేల్లో 282, 17 టీ20ల్లో 17 వికెట్లతో పాటుగా 100 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 102 వికెట్లను కూల్చాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో మరో విశేషం ఏంటంటే? 11 మంది భారత ఆటగాళ్లు బౌలింగ్ చేయడమే. అదీకాక ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వసీం జాఫర్ లు తమ తొలి టెస్ట్ వికెట్ ను ఈ మ్యాచ్ లోనే సాధించారు. ఫాస్ట్ బౌలర్ జహీర్ స్పిన్ బౌలింగ్ వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.