Nidhan
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మరోమారు తన సత్తా చాటాడు. బ్యాట్‌తో ఒక రేంజ్లో చెలరేగిపోయాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మరోమారు తన సత్తా చాటాడు. బ్యాట్‌తో ఒక రేంజ్లో చెలరేగిపోయాడు.
Nidhan
వారసత్వాన్ని నిలబెట్టడం అంత ఈజీ కాదు. ఆ రంగం, ఈ రంగమనే తేడా లేదు. చాలా ఇండస్ట్రీల్లో వారసులు రావడం చూస్తూనే ఉన్నాం. ఇది తప్పా? ఒప్పా? అనే డిస్కషన్‌ను పక్కనబెడితే.. వారసత్వాన్ని కంటిన్యూ చేయడం మాత్రం కత్తి మీద సాము అనే చెప్పాలి. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ శిఖరానికి చేరుకున్న వారి మీద ఎక్స్పెక్టేషన్స్ అంతగా ఉండవు. కానీ వారసులు అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. వాళ్లకు ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ టైమ్ ఉండదు. రాగానే సక్సెస్ కొట్టేయాలి అనేలా సిచ్యువేషన్ ఉంటుంది. అందుకే చాలా కొద్ది మంది వారసులే సక్సెస్ అయ్యారు. క్రికెట్లో కూడా సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్‌తో పాటు కొందరు వారసులు ఎంట్రీ ఇచ్చినా విజయవంతం కాలేకపోయారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే అతడు అంతగా రాణించకపోవడంతో విమర్శకుల టార్గెట్ అవుతున్నాడు. కానీ తాజాగా ఓ బ్లాస్టింగ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడతను.
రంజీ ట్రోఫీ-2024లో అర్జున్ టెండూల్కర్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా అందరి చూపుల్ని తన వైపునకు తిప్పుకున్నాడు. తండ్రి బాటలో పయనించేందుకు కష్టపడుతున్న అర్జున్.. మంచి ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో గోవా తరఫున ఆడుతున్న సచిన్ కొడుకు.. చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఈ మధ్య తరచూ విఫలమవుతున్న అర్జున్.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన బ్యాట్ పవర్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా 618/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో సూయాష్ ప్రభుదేశాయ్ (197) తృటిలో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. దీప్రాజ్ గావోంకర్ (115) సెంచరీతో మెరవగా.. కృష్ణమూర్తి సిద్ధార్థ్ (77) కూడా ఆకట్టుకున్నాడు.
ఆఖర్లో అర్జున్ టెండూల్కర్ వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌తో గోవా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీప్రాజ్తో కలసి అతడు మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. వీళ్లిద్దరూ బౌండరీలు, సిక్సులతో చెలరేగడంతో చండీగఢ్ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చండీగఢ్ రెండో రోజు ముగిసేసరికి 18 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 73 పరుగులతో ఉంది. బ్యాట్‌తో రఫ్ఫాడించిన అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లోనూ సత్తా చాటాలి. ఈ రంజీ సీజన్‌తో పాటు వచ్చే ఐపీఎల్లో అతడు ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలి. ప్రస్తుతం అర్జున్ ఆడుతున్న తీరు, బ్యాటింగ్‌లో చూపిస్తున్న అగ్రెషన్‌ను బట్టి అతడు ఐపీఎల్-2024లో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించడం ఖాయం. మరి.. అర్జున్ టెండూల్కర్ విధ్వంసక ఇన్నింగ్స్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: కిట్ కోసం గోల్డ్ తాకట్టు పెట్టిన తల్లి.. తండ్రి వెక్కిరింపులు! కట్ చేస్తే.. టీమిండియాలోకి!