iDreamPost
android-app
ios-app

క్రికెట్ లో ఆ ఇద్దరే నాకు స్ఫూర్తి.. ఒకరు కోహ్లీ, మరొకరు ఎవరంటే?: రజత్ పాటిదార్

  • Published May 10, 2024 | 10:55 AM Updated Updated May 10, 2024 | 10:55 AM

క్రికెట్ లో తన రోల్ మోడల్స్ వీరే అంటూ ఇద్దరు దిగ్గజాల పేర్లు చెప్పుకొచ్చాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్. అందులో ఒకరు విరాట్ కోహ్లీ కాగా.. ఇంకొకరు ఎవరంటే?

క్రికెట్ లో తన రోల్ మోడల్స్ వీరే అంటూ ఇద్దరు దిగ్గజాల పేర్లు చెప్పుకొచ్చాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్. అందులో ఒకరు విరాట్ కోహ్లీ కాగా.. ఇంకొకరు ఎవరంటే?

క్రికెట్ లో ఆ ఇద్దరే నాకు స్ఫూర్తి.. ఒకరు కోహ్లీ, మరొకరు ఎవరంటే?: రజత్ పాటిదార్

రజత్ పాటిదార్.. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్లలో ఒకడు. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి భాగంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన పాటిదార్.. సెకండాఫ్ లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో అతడు చేసింది 213 పరుగులే కావొచ్చు.. కానీ అందులో నాలుగు అద్భుతమైన అర్ధశతకాలు ఉండటం విశేషం. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 241 పరుగుల భారీ స్కోర్ చేసిందంటే దానికి ఒక కారణం రజత్ మెరుపు బ్యాటింగే. అతడు కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీతో అదరగొట్టాడు.  కాగా.. క్రికెట్ లో తన రోల్ మోడల్స్ వారే అంటూ ఇద్దరు దిగ్గజాల పేర్లు చెప్పుకొచ్చాడు రజత్ పాటిదార్.

నిన్న ధర్మశాల వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్ లో కేవలం 21 బంతుల్లోనే 50 కొట్టాడు రజత్. ఇందులో 6 సిక్సులు ఉండటం విశేషం. మరీ ముఖ్యంగా ఈ ఐపీఎల్ లో లెగ్ స్పిన్నర్లను టార్గెట్ చేసుకుని దంచికొడుతున్నాడు. ఇదిలా ఉండగా.. పంజాబ్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం అతడు క్రికెట్ లో తన రోల్ మోడల్స్ వీరే అంటూ ఇద్దరు దిగ్గజాల పేర్లు చెప్పుకొచ్చాడు. “క్రికెట్ లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్  నాకు స్ఫూర్తి. వారిని చూసే నేను ఎలా ఆడాలో నేర్చుకున్నాను. వీరే నాకు రోల్ మోడల్స్” అంటూ చెప్పుకొచ్చాడు పాటిదార్.

కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ లో రజత్ పాటిదార్ నాలుగు అర్ధశతకాలతో మెరిశాడు. అందులో ముంబై పై 26 బంతుల్లో 50, కేకేఆర్ పై 23 బంతుల్లో 52 పరుగులు, సన్ రైజర్స్ పై 20 బంతుల్లో 50, తాజాగా పంజాబ్ పై 23 బాల్స్ లో 55 రన్స్ చేశాడు. దీంతో పాటుగా ఈ ఐపీఎల్ సీజన్ లో లెగ్ స్పిన్నర్ల పాలిట యముడిలా మారాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు లెగ్ స్పిన్నర్ల బౌలింగ్ లో 48 బంతులు ఎదుర్కొని 264 స్ట్రైక్ రేట్ తో 127 పరుగులు చేశాడు. అందులో 15 సిక్సర్లు ఉండటం విశేషం. మరి విరాట్ కోహ్లీ, ఏబీడీ తన రోల్ మోడల్స్ అన్న పాటిదార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.