SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నిలకడగానే ఆడుతోంది. యువ క్రికెటర్ జైస్వాల్ వన్ మ్యాన్ ఆర్మీలా ఇంగ్లండ్‌పై చెలరేగుతున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో పాటిదార్ అవుట్ తీరు మాత్రం.. పాపం అనేలా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నిలకడగానే ఆడుతోంది. యువ క్రికెటర్ జైస్వాల్ వన్ మ్యాన్ ఆర్మీలా ఇంగ్లండ్‌పై చెలరేగుతున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో పాటిదార్ అవుట్ తీరు మాత్రం.. పాపం అనేలా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ నిలకడగానే సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హీరోగా మారాడు. ఇప్పటికే సెంచరీ పూర్తి చేసుకుని.. డబుల్ సెంచరీపై దూసుకెళ్తున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌తోనే టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్ మంచి ఇంటెంట్ చూపిస్తూ.. బాగా ఆడుతున్నాడు అనుకునే లోపే.. దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోర్లకే అవుటైన చోట.. తొలి మ్యాచ్ ఆడుతున్న ఒత్తిడి ఏ మాత్రం కనిపించకుండా.. ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మరో ఎండ్‌లో జైస్వాల్ చెలరేగి ఆడుతుంటే.. అతనికి అద్భుతమైన సపోర్ట్ అందించాడు.
కానీ, రెహాన్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 72వ ఓవర్ తొలి బంతిని డిఫెన్స్ ఆడాడు. కానీ, బాల్ బౌన్స్ అయి వెనక్కి వెళ్లింది. అప్పటికే పాటిదార్ కాలితో ఆపేందుకు ప్రయత్నించానా.. బాల్ వెళ్లి వికెట్లను తాకడం బెయిల్ పడిపోవడం జరిగిపోయాయి. అప్పటి వరకు బాగా ఆడుతున్న పాటిదార్.. ఇలా తన తప్పులేకుండా.. అద్భుతమైన డెలవరీ కూడా కాకుండా అవుట్ అయ్యాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న అతను ఇంత అన్‌లక్కీగా అవుట్ అవ్వడంతో చాలా నిరాశగా గ్రౌండ్ వీడాడు. అయితే.. అప్పటి వరకు రజత్ పాటిదార్ ఆడిన ఆటపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్న జో రూట్ బౌలింగ్‌లో రివర్స్ స్విప్ షాట్లు ఆడి.. బౌలింగ్‌ను ట్యాకిల్ చేశాడు. మొత్తంగా 72 బంతుల్లో 3 ఫోర్లతో 32 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్యాడ్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్ గిల్ 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక బ్యాడ్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా 27 పరుగులకే అవుట్ అయ్యాడు. వీరి ముగ్గురి కంటే.. పాటిదార్ బాగా ఆడాడు. ప్రస్తుతం జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. 150 పరుగుల మార్క్ దాటి డబుల్ సెంచరీ దిశగా అడుగులేస్తున్నాడు. అతనితో పాటు అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 500 ప్లస్ రన్స్ చేస్తే.. మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్‌లో పాటిదార్ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rajat Patidar faces an unfortunate dismissal in his debut game against England.
📸: Jio Cinema pic.twitter.com/YzPSywqdkT
— CricTracker (@Cricketracker) February 2, 2024