IND vs ENG: రజత్‌ పటీదార్‌ vs సర్ఫరాజ్‌ ఖాన్‌! రెండో టెస్టులో ఎవర్ని ఆడిస్తే బెటర్‌? రికార్డ్స్‌ ఇవే..

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్టులో ఎలాగైన గెలవాలన కసితో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో జట్టులో ఎవర్ని తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. పటీదార్‌-సర్ఫరాజ్‌లో ఎవర్ని ఆడిస్తే బెటర్‌ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఇద్దరిలో ఎవరు బెటరో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్టులో ఎలాగైన గెలవాలన కసితో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో జట్టులో ఎవర్ని తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. పటీదార్‌-సర్ఫరాజ్‌లో ఎవర్ని ఆడిస్తే బెటర్‌ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఇద్దరిలో ఎవరు బెటరో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు కోసం టీమిండియా సిద్ధమవుతోంది. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు జరగనుంది. ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌ వేదికగా జరినగి తొలి టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. నిజానికి ఆ మ్యాచ్‌లో టీమిండియానే గెలవాల్సింది. ఆరంభం నుంచి రెండున్నర రోజుల పాటు ఇంగ్లండ్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌.. ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టు చేజార్చుకుంటూ వెళ్లింది. ఓలీ పోప్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌కి తోడు.. రెండు ఇన్నింగ్స్‌లో టీమిండియా చెత్త బ్యాటింగ్‌ టీమిండియాను విజయానికి దూరం చేసి.. ఓటమికి దగ్గర చేశాయి. ఊహించని ఈ పరాజయంతో టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఎలాగైన రెండో టెస్టులో గెలిచి.. పరువు నిలబెట్టుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది.

అయితే.. తొలి టెస్టులో మంచి ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ రెండు టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో గాయాలతో వాళ్లిద్దరూ రెండో మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే.. వీరి స్థానంలో రెండో టెస్ట కోసం సెలెక్టర్ల ఓ ముగ్గరు ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. సర్ఫరాజ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. అయితే.. అంతకంటే ముందే టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తొలి టెస్ట్‌కి ముందుకు తన వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరం కావడంతో అతని స్థానంలో యువ క్రికెటర్‌ రజత్‌ పటీదార్‌ను తీసుకున్నారు. అయితే.. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న ఆటగాళ్లలో జడేజా, రాహుల్‌ లేకపోవడం, శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌లో లేకపోవడంతో ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌ స్థానంలో ఎవర్ని తీసుకుంటారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. గిల్‌, అయ్యర్‌ను కొనసాగించినా.. జడేజా స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను ఆడిస్తే.. ఒక మిగిలింది కేఎల్‌ రాహుల్‌ స్థానం. ఆ స్థానంలో రజత్‌ పటీదార్‌ లేదా సర్ఫరాజ్‌ ఖాన్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి వీరిద్దరిలో ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి. ఇప్పుడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌లకు కూడా ఈ విషయం తలనొప్పిగా మారింది. అయితే.. ఒకసారి వారిద్దరి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ రికార్డ్స్‌ చూద్దాం.. రజత్‌ పటీదార​ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 55 మ్యాచ్‌ల్లో 93 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 4 వేల పరుగులు చేశాడు. 45.97 సగటు, 53.48 స్ట్రైక్‌రేట్‌ ఉంది. అలాగే 22 హాఫ్‌ సెంచరీలు, 12 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 196. ఇక సర్ఫరాజ్‌ ఖాన్‌ విషయానికి వస్తే.. 45 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 66 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్‌ 3912 పరుగులు చేశాడు. 69.85 సగటు, 70.48 స్ట్రైక్‌రేట్‌ ఉంది. 11 హాఫ్‌ సెంచరీలు, 14 సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోర్‌ 301(నాటౌట్‌)గా ఉంది. ఈ లెక్కన రెండో టెస్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఆడిస్తే బెటర్‌ అని క్రికెట్‌ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments