iDreamPost
android-app
ios-app

Rajat Patidar: ఆ బౌలర్లంటే పాటిదార్ కు పూనకాలే.. గణాంకాలు చూస్తే కళ్లు తేలేస్తారు!

  • Published May 09, 2024 | 9:57 PM Updated Updated May 09, 2024 | 9:57 PM

IPL 2024 సీజన్ లో ఆ బౌలర్ల పాలిట సింహ స్వప్నంలా మారాడు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్. వారి బౌలింగ్ లో దంచికొడుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024 సీజన్ లో ఆ బౌలర్ల పాలిట సింహ స్వప్నంలా మారాడు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్. వారి బౌలింగ్ లో దంచికొడుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Rajat Patidar: ఆ బౌలర్లంటే పాటిదార్ కు పూనకాలే.. గణాంకాలు చూస్తే కళ్లు తేలేస్తారు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ ఐపీఎల్ సెకండాఫ్ లో చెలరేగిపోతున్నాడు. వరుసగా ఫిఫ్టీలు బాదుతూ.. సత్తాచాటుతున్నాడు. తాజాగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం బాది ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్ లో 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 55 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే ఈ సీజన్ లో లెగ్ స్పిన్నర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు రజత్ పాటిదారు. వారి బౌలింగ్ లో అతడు ఎన్ని పరుగులు చేశాడో తెలుసా? ఆ గణాంకాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

రజత్ పాటిదార్.. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. తనకు లభించిన లైఫ్ తో రఫ్పాడించాడు. మరీ ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ ను టార్గెట్ చేసుకుని అతడి ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. అయితే రజత్ పాటిదార్ కు లెగ్ స్పిన్నర్లు బౌలింగ్ వేస్తుంటే పూనకాలే.. వారి బౌలింగ్ లో రెచ్చిపోయి దంచికొడుతుంటాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు లెగ్ స్పిన్ లో 48 బంతులు ఎదుర్కొని 127 పరుగులు చేశాడు. అందులో 15 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇక బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసి 127 కాగా.. స్ట్రైక్ రేట్ ఏకంగా 264.58గా ఉంది. ఈ గణాంకాలను బట్టే అర్ధం చేసుకోవచ్చు అతడికి లెగ్ స్పిన్ లో కొట్టడం అంటే ఎంత ఇష్టమో.

కాగా.. ఈ సీజన్ లో రజత్ పాటిదారు ఆడిన 11 మ్యాచ్ ల్లో 213 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉండటం విశేషం. ముంబై పై 26 బంతుల్లో 50, కేకేఆర్ పై 23 బంతుల్లో 52 పరుగులు, సన్ రైజర్స్ పై 20 బంతుల్లో 50, తాజాగా పంజాబ్ పై 23 బాల్స్ లో 55 రన్స్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 92 పరుగులు చేసి.. ఈ సీజన్ లో మరో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అర్షదీప్ బౌలింగ్ లో రూసోకు క్యాచ్ ఇచ్చి విరాట్ 4వ వికెట్ గా వెనుదిరిగాడు. ఇక చివర్లో కామెరూన్ గ్రీన్(46), దినేశ్ కార్తీక్(18) పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు.