iDreamPost
android-app
ios-app

RCBని దారుణంగా ట్రోల్‌ చేసిన రాజస్థాన్‌! దిమ్మతిరిగే కౌంటరిచ్చిన RCB ఫ్యాన్స్‌

  • Published Mar 18, 2024 | 11:21 AM Updated Updated Mar 18, 2024 | 11:27 AM

Rajasthan Royals vs RCB Trolling: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందే రాజస్థాన్‌ రాయల్స్‌.. ఆర్సీబీని గిల్లింది. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఉమెన్స్‌ టీమ్‌ కప్పు గెలవడంతో.. ఆర్సీబీ మెన్స్‌ టీమ్‌ను రాజస్థాన్‌ దారుణంగా ట్రోల్‌ చేసింది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

Rajasthan Royals vs RCB Trolling: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందే రాజస్థాన్‌ రాయల్స్‌.. ఆర్సీబీని గిల్లింది. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఉమెన్స్‌ టీమ్‌ కప్పు గెలవడంతో.. ఆర్సీబీ మెన్స్‌ టీమ్‌ను రాజస్థాన్‌ దారుణంగా ట్రోల్‌ చేసింది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

  • Published Mar 18, 2024 | 11:21 AMUpdated Mar 18, 2024 | 11:27 AM
RCBని దారుణంగా ట్రోల్‌ చేసిన రాజస్థాన్‌! దిమ్మతిరిగే కౌంటరిచ్చిన RCB ఫ్యాన్స్‌

ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, మాస్‌ క్రేజ్‌ ఉన్న టీమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఐపీఎల్‌ ప్రారంభమై 16 ఏళ్లు గడుస్తున్నా.. ఆ టీమ్‌ ఒక్కటంటే ఒక్క కప్పు కూడా గెలవలేదు. అయినా కూడా దాని క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. కోహ్లీ ఆ టీమ్‌లో కొనసాగినంత కాలం.. ఈ క్రేజ్‌ అలాగే ఉంటుంది అందులో ఎలాంటి డౌట్‌ లేదు. అయితే.. తాజాగా ఉమెన్స్‌ ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు ఛాంపియన్‌గా నిలిచి కప్పు కొట్టింది. స్మృతి మంధాన కెప్టెన్సీలోని ఆర్సీబీ లేడీ టీమ్‌.. ఆదివారం జరిగిన డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే.. 16 ఏళ్లుగా మెన్స్‌ ఆర్సీబీ టీమ్‌ సాధించలేని కప్పును.. ఉమెన్స్‌ టీమ్‌ రెండో సీజన్‌లోనే సాధించడంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.

ఉమెన్స్‌ టీమ్‌ను ప్రశంసలతో మెచ్చుకుంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్‌.. ఇన్నేళ్ల ఎదురుచూపులకు తెరదించారని, ఒక రకంగా చెప్పాలంటే కప్పు కరువు తీర్చారని.. మీరిచ్చిన స్ఫూర్తితో మెన్స్‌ టీమ్‌ కూడా ఈ ఏడాది కప్పు కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘సాలా కప్‌ నమ్‌దే’ మాటను ఇన్నాళ్లకు నిజం చేసినందుకు ‘మంధాన అండ్‌ కో’కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే.. ఈ క్రమంలో మరో ఐపీఎల్‌ టీమ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌.. ఆర్సీబీకి కంగ్రాట్స్‌ చెబుతూనే.. మెన్స్‌ టీమ్‌ను దారుణంగా ట్రోల్‌ చేసింది. దానికి ఆర్సీబీ ఫ్యాన్స్‌ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్‌ అవుతూ.. రాజస్థాన్ రాయల్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఆర్సీబీ ఉమెన్స్‌ టీమ్‌ డబ్ల్యూపీఎల్‌ కప్పు గెలిచిన తర్వాత.. రాజస్థాన్‌ రాయల్స్‌ తమ ట్వీట్టర్‌ అకౌంట్‌లో కంగ్రాట్స్‌ చెబుతూ.. ఓ హిందీ కామెడీ సీరియల్‌లోని ఇమేజ్‌ను పోస్ట్ చేసింది. అందులో ఓ పురుషుడు గ్యాస్‌ సిలిండర్‌ను మోయలేక ఇబ్బంది పడుతుంటే.. ఒక లేడీ అదే సిలిండర్‌ను చంకలో పెట్టి తీసుకెళ్తుంది. దీని అర్థం.. ఆర్సీబీ మెన్స్‌ టీమ్‌ ఐపీఎల్‌ కప్పు గెలిచేందుకు ఆపసోపాలు పడుతుంటే.. ఉమెన్స్‌ టీమ్‌ రెండో సీజన్‌లో కొట్టేసిందని రాజస్తాన్‌ రాయల్స్‌ ఉద్దేశం. ఈ ట్వీట్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్‌ రియాక్ట్‌ అవుతూ.. అదే సీరియల్‌ యాక్టర్‌ జైల్‌లో ఉన్న ఇమేజ్‌ పోస్ట్‌ చేశారు. దీన​ర్థం ఏంటంటే.. 2016, 2017 సీజన్లలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌పై బీసీసీఐ బ్యాన్‌ విధించింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ.. ముందు మీరు క్రికెట్‌ నిజాయితీగా ఆడండి అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మరి రాజస్థాన్‌ ట్రోలింగ్‌కి ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş