SNP
Rajasthan Royals, Pinky Promise: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా పింక్ జెర్సీతో బరిలోకి దిగనుంది. అయితే.. మ్యాచ్‌లో ఆ జట్టు పింక్ ప్రామిస్ అంటూ ఓ మంచి కార్యక్రమం చేయపట్టనుంది. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..
Rajasthan Royals, Pinky Promise: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా పింక్ జెర్సీతో బరిలోకి దిగనుంది. అయితే.. మ్యాచ్‌లో ఆ జట్టు పింక్ ప్రామిస్ అంటూ ఓ మంచి కార్యక్రమం చేయపట్టనుంది. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ అంటే అంతా బిజినెస్ అని, ఆటగాళ్లను సంతలో పశువులను కొన్నట్లు వేలంలో కొనుగోలు చేసి ఆడిస్తున్నారని, ఇది బీసీసీఐకి బంగారు బాతు అని చాలా మంది అంటూ ఉంటారు. పక్కా కమర్షియల్ లీగ్‌గా ఐపీఎల్‌కు పేరుంది. కానీ, ఈ ఐపీఎల్ వల్ల పేద ప్రజలకు ఎంతో కొంత మేలు కూడా జరుగుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో చాలా కుటుంబాల్లో ఉచిత విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. అదేంటి.. అసలు క్రికెట్‌కు, ఉచిత విద్యుత్‌కు ఏంటి సంబంధం అని కంగారు పడకండి. దాని వెనుక ఒక లింక్ ఉంది. అదేంటంటే.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ శనివారం రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో మ్యాచ్ ఆడనుంది. జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను రాజస్థాన్ టీమ్ పూర్తి పింక్ కలర్ జెర్సీలో ఆడనుంది.
రాజస్థాన్‌లోని మహిళలకు ఈ మ్యాచ్‌ను పూర్తిగా డెడికేట్ చేస్తూ.. ఆర్‌ఆర్ టీమ్ ఫుల్ పింక్ కలర్ జెర్సీతో ఆడనుంది. దీనికి ‘పింక్ ప్రామిస్’ అని పేరు పెట్టారు. ఈ పింక్ ప్రామిస్‌లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్, రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్‌తో కలిసి ఓ మంచి కార్యక్రమం చేపట్టనుంది. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో నమోదు అయ్యే ప్రతి సిక్స్‌కు బదులు.. ఆరు ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ బిగించి.. వారికి సోలర్ విద్యుత్‌ను అందించనున్నారు. అలా ఎన్ని సిక్స్‌లు నమోదు అయితే అన్ని ఆరేసి ఇళ్లకు ఇలా ఉచితంగా విద్యుత్‌ను అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ చేపట్టింది.
శనివారం జరిగే మ్యాచ్‌లో సుమారు ఓ 20 సిక్సులు నమోదు అయ్యాయి అనుకుంటే.. 20 ఇంటూ 6.. 120 ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్‌ను అందించనున్నారు. అలాగే రాజస్థాన్ ఆడే స్పెషల్ పింక్ జెర్సీ అమ్మకాలతో వచ్చిన మొత్తం డబ్బును, అలాగే మ్యాచ్ టిక్కెట్ అమ్మకాలపై వచ్చే మొత్తం నుంచి కొంత విరాళంగా ఇవ్వనున్నారు. అంటే ఒక్కో టిక్కెట్‌పై వంద రుపాయాలు డొనేట్ చేస్తారు. ఈ డబ్బును రాజస్థాన్‌లోని పేద మహిళల సాధికారత కోసం, అలాగే ఆర్థికంగా వారిని బలోపేతం చేసేందుకు ఉపయోగించనున్నారు. రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల కోసం ఇంతలా ఆలోచిస్తున్న టీమ్‌కు తాము మద్దతుగా ఉంటామంటూ చాలా మంది సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆర్‌ఆర్ చేస్తున్న ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rajasthan Royals promo for the Pink match against RCB tomorrow.
– A great initiative by RR dedicated to all the women. 👏pic.twitter.com/md6Tfkxoui
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 5, 2024
New profile picture anyone? Reply with your name and number 💗👚 #PinkPromise pic.twitter.com/DhvPRuczAV
— Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2024