SNP
Rajasthan Royals, Qualifier 2, SRH, IPL 2024: క్వాలిఫైయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి.. ఈ సీజన్‌లో తమ ప్రస్థానం ముగించింది. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత ఆర్‌ఆర్ సారీ చెప్పింది. ఆ సారీ ఎందుకో ఇప్పుడు చూద్దాం..
Rajasthan Royals, Qualifier 2, SRH, IPL 2024: క్వాలిఫైయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి.. ఈ సీజన్‌లో తమ ప్రస్థానం ముగించింది. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత ఆర్‌ఆర్ సారీ చెప్పింది. ఆ సారీ ఎందుకో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ క్వాలిఫైయర్ – 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్ ఆరంభంలో ఎంతో అద్భుతంగా ఆడిన ఆర్‌ఆర్.. తర్వాత వరుస ఓటములతో కాస్త వెనుక బడింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. తొలి రెండు స్థానాల్లో ఉండాల్సిన ఆర్‌ఆర్.. చివరి నాలుగు లీగ్ మ్యాచ్‌లలో ఓటమి పాలుకావడం, కేకేఆర్‌తో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. మూడో స్థానానికి పరిమితం అయింది. అదే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్‌కు దూరం చేసిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రస్థానం ముగిసింది. అయితే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ క్షమాపణలు కోరింది. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ ఆరంభం సీజన్ 2008లో రాజస్థాన్ రాయల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. మళ్లీ ఎప్పుడూ కప్పు కొట్టలేదు. 2016, 2017 సీజన్లలో నిషేధానికి గురైనా ఆర్‌ఆర్.. మొత్తంగా 14 సీజన్లుగా కప్పు లేకుండా ఉంది. అయితే.. ఈ సారి కప్పు ఎలాగైనా కొట్టాలనే టార్గెట్‌తో బరిలోకి దిగింది ఆర్‌ఆర్. సంజు శాంసన్ కెప్టెన్సీలో మంచి టీమ్‌ను బిల్డ్ చేసుకుని.. సూపర్ స్ట్రాంగ్ టీమ్‌గా బరిలోకి అదే రేంజ్‌లో ఆడింది కూడా. ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఫామ్‌లో లేకపోయినా.. కెప్టెన్ శాంసన్, రియాన్ పరాగ్ జట్టును అద్భుతంగా నడిపించారు. బట్లర్ స్వదేశానికి వెళ్లిపోవడంతో ఆర్‌ఆర్ కాస్త బలహీనపడింది. అయినా కూడా మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుని.. ఎలిమినేటర్‌లో పటిష్టమైన ఆర్సీబీని ఓడించి క్వాలిఫైయర్-2 ఆడింది. కానీ, సన్‌రైజర్స్‌లో ఓడిపోవడంతో.. కప్పు కొట్టలేకపోయినందుకు తమ అభిమానులను క్షమాపణలు కోరింది ఆర్‌ఆర్ మేనేజ్‌మెంట్.
నిజానికి చెన్నై లాంటి స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై అంతా ఆర్‌ఆర్‌దే విజయం అనుకున్నారు. ఎందుకంటే.. రాజస్థాన్ రాయల్స్ వద్ద ఇద్దరు ప్రపంచ శ్రేణి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. అందులోనూ అశ్విన్‌కి అది హోం పిచ్. పైగా టాస్ కూడా ఆర్‌ఆర్ గెలవడంతో ఇక ఎస్‌ఆర్‌హెచ్ ఇంటికే అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే.. ఎంతో అద్భుతంగా అశ్విన్, చాహల్‌ను ఎంతో సమర్థవంతంగా ఆడాడు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు. వాళ్లిద్దరికి ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ వస్తుంది అనుకుంటే అదీ రాలేదు. పైగా ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మాద్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ రెచ్చిపోవడంతో ఆర్‌ఆర్‌కు ఓటమి తప్పలేదు. కప్పు కొడుతుంది అనుకున్న టీమ్ ఇలా క్వాలిఫైయర్-2లో ఇంటి బాట పట్టడంతో చాలా మంది నిరాశ చెందారు. ఈ క్రమంలో తమ అభిమానులకు సారీ చెబుతూ.. ఆర్‌ఆర్ ట్వీట్ చేసింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We’re sorry, #RoyalsFamily. pic.twitter.com/H85WckpSkL
— Rajasthan Royals (@rajasthanroyals) May 24, 2024