వీడియో: కోహ్లీ ఎఫెక్ట్‌.. ఆవేశ్‌ ఖాన్‌కు హెల్మెట్‌ ఇవ్వని RR మేనేజ్‌మెంట్‌!

Avesh Khan, KKR vs RR: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆవేశ్‌ ఖాన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కావాలనే హెల్మెట్‌ ఇవ్వలేదనే టాక్‌ వినిపిస్తోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Avesh Khan, KKR vs RR: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆవేశ్‌ ఖాన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కావాలనే హెల్మెట్‌ ఇవ్వలేదనే టాక్‌ వినిపిస్తోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కత్తా నైడ్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ సూపర్‌ విక్టెరీ సాధించింది. ఏకంగా 224 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించి.. హిస్టరీ క్రియేట్‌ చేసింది. మిస్టర్‌ స్పిన్నర్‌ సునీల్‌ ఓపెనర్‌గా వచ్చి సెంచరీతో చెలరేగి కేకేఆర్‌కు భారీ స్కోర్‌ అందించినా.. రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ సైతం సెంచరీతో కదం తొక్కి ఆర్‌ఆర్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు చేసుకున్న విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌పై భారీగా జోకులు పేలుతున్నాయి. మరీ మఖ్యంగా ఆ జట్టు స్టార్‌ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ సెలబ్రేషన్స్‌పై అయితే ఏకంగా క్రికెట్‌ నిపుణులు కూడా స్పందించారు. ఎందుకంటే నిన్నటి మ్యాచ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ హెల్మెట్‌తో రాలేదు. హెల్మెట్‌ లేకుండానే జోస్‌ బట్లర్‌తో గెలుపును సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

దీంతో.. రాజస్థాన్‌ రాయల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆవేశ్‌ ఖాన్‌కు కావాలనే హెల్మెట్‌ ఇవ్వలేదనే టాక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. అదేంటి.. బ్యాటింగ్‌కు వచ్చే క్రికెటర్‌కు హెల్మెట్‌ ఎంతో ముఖ్యంగా కదా.. మరి ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ ఎందుకు ఆవేశ్‌ ఖాన్‌కు హెల్మెట్‌ ఇవ్వలేదని చాలా మంది ఆశ్యర్యపోతున్నారు. దీనికి కొంతమంది క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. కావాలనే ఆవేశ్‌ ఖాన్‌కు హెల్మెట్‌ ఇవ్వలేదనే దాంట్లో నిజం లేకపోయినా.. ఐపీఎల్‌ 2023 సందర్భంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. గెలుపు సమయంలో క్రీజ్‌లో ఉన్న ఆవేశ్‌ ఖాన్‌.. విజయంలో తన పాత్ర పెద్దగా లేకపోయినా కూడా చాలా ఆవేశానికి గురై.. తన హెల్మెట్‌ను తీసి.. నేలకేసి కొట్టాడు. అది అప్పట్లో బాగా వైరల్‌ అయింది.

అది కూడా విరాట్‌ కోహ్లీ టీమ్‌కు వ్యతిరేకంగా ఆవేశ్‌ ఖాన్‌ అలా చేయడంతో కోహ్లీ ఫ్యాన్స్‌ ఆవేశ్‌తో పాటు, లక్నో​ టీమ్‌ను సోషల్‌ మీడియాలో ఏకిపారేశారు. ఆ ఘటనను మనసులో దాచుకున్న విరాట్‌ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో టార్గెట్‌ చేసి మరి కొట్టి.. అప్పుడు ఆవేశ్‌ ఖాన్‌ హెల్మెట్‌ విసిరేసిన యాక్షన్‌ను చేసి చూపించి రివేంజ్‌ తీర్చుకున్నాడు. మ్యాచ్‌కి ముందు కూడా ఇలాంటి ఛాన్స్‌ మళ్లీ ఎక్కడ దొరుకుతుందంటూ.. ఆవేశ్‌కు స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. ఇప్పుడు కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా విజయానికి చివర్లో క్రీజ్‌లోకి వెళ్లిన ఆవేశ్‌ ఖాన్‌.. మళ్లీ హెల్మెట్‌ విసిరి.. లేని రచ్చను ఎక్కడ సృష్టిస్తాడో అని భయపడిన రాజస్థాన్‌ రాయల్స్‌ మేనేజ్‌మెంట్‌ అతనికి కావాలనే హెల్మెట్‌ ఇవ్వకుండా పంపిందని, పైగా ఆవేశ్‌ ఖాన్‌ ఒక బాల్‌ మిగిలి ఉండగా నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు బ్యాటింగ్‌కు వెళ్తున్నాడని కాబట్టి అతనికి హెల్మెట్‌ అవసరం లేదని కూడా భావించి ఉంటారని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఈ విధంగా ఆవేశ్‌ ఖాన్‌పై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments