IPL 2025లో ఆ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌!

Rahul Dravid, Rajasthan Royals, IPL 2025: టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. మరోసారి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rahul Dravid, Rajasthan Royals, IPL 2025: టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. మరోసారి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌, మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరోసారి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే.. ఈ సారి టీమిండియాకు కాదు.. ఐపీఎల్‌లోని ఓ టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉన్నా.. ఇప్పుడు కొన్ని రిపోర్టులు ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. రాహుల్‌ ద్రవిడ్‌ను తమ హెడ్‌ కోచ్‌గా రాజస్థాన్‌ రాయల్స్‌ నియమించుకుందని విశ్వనీయవర్గాల సమాచారం. వచ్చే ఐపీఎల్‌ 2025 సీజన్‌ నుంచి ద్రవిడ్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. దీనిపై ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రాహుల్‌ ద్రవిడ్‌ గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా అలాగే మెంటర్‌గా కూడా పనిచేశాడు. అయితే.. హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ ట్రాక్‌ రికార్డ్‌ అద్భుతంగా ఉందని చెప్పాలి. అందర్‌ 19 నుంచి మొదలుపెడితే.. ఈ ఏడాది టీ20 సాధించిన టీ20 వరల్డ్‌ కప్‌ వరకు ద్రవిడ్‌ కోచ్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. ద్రవిడ్‌ కోచింగ్‌లో టీమిండియా 2022 టీ20 వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌ ఆడింది, అలాగే 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్, అదే ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కూడా ఆడింది. వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది.

అంతకంటే ముందు రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌లో రోహిత్‌ సేన ఆసియా కప్‌ గెలిచింది. ఆ తర్వాత.. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను సాధించి.. ఛాంపియన్‌గా అవతరించింది. ఆ వరల్డ్‌ కప్‌తో తన పదవీ కాలం ముగియడంతో.. ద్రవిడ్‌ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. ఎంతో ఎక్స్‌పీరియన్స్‌తో పాటు, టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా టీ20 వరల్డ్‌ కప్‌ గెలిపించిన ద్రవిడ్‌ను తమ హెడ్‌ కోచ్‌గా నియమించుకోవాలని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫిక్స్‌ అయిపోయింది. అలాగే కుమార సంగాక్కరను టీమ్‌ డైరెక్టర్‌గా కొనసాగిస్తూ.. విక్రమ్‌ రాథోడ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా తీసుకోనుంది ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌. మరి రాజస్థాన్‌కు ద్రవిడ్‌ కోచ్‌గా రెండో కప్‌ అందిస్తాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments