రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ రీఎంట్రీకి అంతా ఫిక్స్ అయిందని సమాచారం. లీగ్‌లోని ఓ ఫ్రాంచైజీకి ఆయన మెంటార్‌గా వెళ్లడం దాదాపు ఖాయమైందని టాక్.
రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ రీఎంట్రీకి అంతా ఫిక్స్ అయిందని సమాచారం. లీగ్‌లోని ఓ ఫ్రాంచైజీకి ఆయన మెంటార్‌గా వెళ్లడం దాదాపు ఖాయమైందని టాక్.
వన్డే వరల్డ్ కప్ ముగిసిపోవడంతో ఇప్పుడు టీమిండియా ఆడే మిగతా సిరీస్‌లపై అందరి ఫోకస్ నెలకొంది. టీ20 ప్రపంచ కప్‌కు మరో ఏడు నెలలు మాత్రమే టైమ్ ఉండటంతో ఇప్పటి నుంచే టీమ్‌ను బిల్డ్ చేసుకోవాలి. అందులో భాగంగానే వరుసగా టీ20 సిరీస్‌లను షెడ్యూల్ చేసింది భారత క్రికెటో బోర్డు (బీసీసీఐ). ఈ షెడ్యూల్లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ కూడా మొదలైపోయింది. వచ్చే పలు నెలల పాటు టీ20, టెస్ట్ సిరీస్‌లు ఆడుతూ.. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతూ టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉండనున్నారు. అయితే మెగా టోర్నీ ముగిసిపోవడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే కెరీర్ ఎండ్ అయినట్లేనా? వీళ్లు టీ20ల్లో కంటిన్యూ అవుతారా? అనే డిస్కషన్ మొదలైంది.
విరాట్-రోహిత్ కెరీర్ విషయంలో ఫైనల్ డెసిషన్‌ను వాళ్లిద్దరికే బీసీసీఐ వదిలేసిందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఏ ఫార్మాట్లో కొనసాగాలి? దేనికి గుడ్ బై చెప్పాలనేది వాళ్ల నిర్ణయానికే వదిలేసిందట. అయితే ఇదే టైమ్‌లో టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఫ్యూచర్ మీదా చర్చ జరుగుతోంది. అఫీషియల్‌గా ఆయన పదవీకాలం ముగిసింది. కానీ ద్రవిడ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాడా? బోర్డు ఆయనకు ఛాన్స్ ఇస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెండేళ్ల పదవీ కాలంలో భారత్‌ను అన్ని ఫార్మాట్లలోనూ నంబన్ వన్ స్థానానికి చేర్చాడు మిస్టర్ కూల్. ఆయన కోచింగ్‌లోనే టీమ్ వరల్డ్ కప్ నెగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి మెట్టుపై బోల్తా పడి కప్పును చేజార్చుకుంది.
ద్రవిడ్ పదవీ కాలం పూర్తవ్వడంతో ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించారు. అయితే మిస్టర్ కూల్ ఓకే అంటే అతడి కాంట్రాక్ట్‌ను బీసీసీఐ మరో ఏడాది పాటు పొడిగించే ఛాన్స్ ఉందట. కానీ దానికి ద్రవిడ్ నో చెప్పినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. టీమిండియా కోచ్‌గా కంటిన్యూ అయ్యే ఆసక్తి ఆయనకు లేదట. దీంతో ఆయన స్థానంలో లక్ష్మణ్ ఫుల్ టైమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం ఫిక్స్ అని అంటున్నారు. లక్షణ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను బీసీసీఐ అధికారులు రెడీ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ద్రవిడ్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇంట్రెస్టింగ్గా మారింది. టీమిండియాకు కోచ్‌గా బాధ్యతలు తీసుకోకముందు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు హెడ్‌గా ఉన్నాడు ద్రవిడ్. ఇప్పుడు లక్ష్మణ్‌కు సీనియర్ టీమ్ బాధ్యతలు అప్పజెప్పి.. మళ్లీ ఎన్ఏసీకు మిస్టర్ కూల్ వెళ్తాడని వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ రీఎంట్రీకి ద్రవిడ్ ఇంట్రెస్ట్‌గా ఉన్నాడని కూడా వినిపిస్తోంది. మెగా లీగ్‌లోని రెండు ఫ్రాంచైజీలు ఆయనతో టచ్‌లో ఉన్నాయట. రాజస్థాన్ రాయల్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ఆయనతో చర్చలు జరుపుతున్నాయట. వీటిల్లో ఏదో ఒక ఫ్రాంచైజీకి ఆయన మెంటార్‌గా వెళ్లే ఛాన్స్ ఉందని టాక్. గతంలో మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ ఇప్పుడు కేకేఆర్‌కు వెళ్లిపోవడంతో ఆ పొజిషన్లో ద్రవిడ్‌ను కూర్చోబెట్టాలని లక్నో మేనేజ్మెంట్ భావిస్తోందట. అయితే తాను గతంలో కెప్టెన్సీ వహించిన రాజస్థాన్‌కు వెళ్లేందుకే ఆయన మొగ్గు చూపిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అటు ఆ ఫ్రాంచైజీలు గానీ ఇటు ద్రవిడ్ గానీ ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి.. ద్రవిడ్ ఐపీఎల్ రీఎంట్రీ న్యూస్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కప్పు రాకున్నా అతడు దొరికాడు చాలంటూ..!
If BCCI doesn’t extend the contract of Rahul Dravid then he might be the mentor of Lucknow or Rajasthan in IPL. [Abhishek Tripathi] pic.twitter.com/Hz8jNlLUzI
— Johns. (@CricCrazyJohns) November 24, 2023