SNP
Rahul Dravid, Gautam Gambhir: టీమిండియా నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు.. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి ఓ స్పెషల్ మెసేజ్ వచ్చింది. అది విని.. గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Rahul Dravid, Gautam Gambhir: టీమిండియా నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు.. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి ఓ స్పెషల్ మెసేజ్ వచ్చింది. అది విని.. గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోసం ఒక స్పెషల్ మెసేజ్‌ను పంపించాడు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ టీమిండియాతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. నేటి(శనివారం) నుంచి లంకతో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్‌గా తన జర్నీ ప్రారంభించబోతున్న గంభీర్‌కు.. మాజీ హెడ్ కోచ్ ద్రవిడ్ స్పెషల్ విషెస్ చెప్తూ.. ఒక ఎమోషనల్ మెసేజ్ పంపించాడు.. మన ప్రపంచంలో మోస్ట్ ఎగ్జైట్‌మెంట్ జాబ్‌కి స్వాగతం.. ఒక ఆటగాడిగా గంభీర్‌తో కలిసి ఆడాను, దేశం కోసం అతని డెడికేషన్ ఏంటో ప్రత్యక్షంగా చూశాను.. టీమిండియా కోసం గొప్పగా పని చేస్తావని తెలుసు.. అలాగే కష్టకాలం వచ్చినా.. టీమిండియా ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ నీ వెంట ఉంటుంది అంటూ ద్రవిడ్ తెలిపాడు.
‘ఐపీఎల్‌లో ఒక మెంటర్‌గా గెలవాలనే నీ కసిని చూశాను. అలాగే యువ క్రికెటర్లను నువ్వు ట్రైన్ చేసే విధానం, వాళ్లను బెస్ట్ క్రికెటర్లుగా నువ్వు మార్చే తీరు చూశాను. ఇండియన్ క్రికెట్ కోసం నువ్వు ఎంత డెడికేటెడ్‌గా, ప్యాషనేట్‌గా ఉన్నావో తెలుసు.. అదే డిడికేషన్, ప్యాషన్‌ను ఇప్పుడు కోచ్‌గా కూడా కొనసాగించాలి. నీకు తెలుసు.. నీపై ఎలాంటి అంచనాలు ఉంటాయో.. కష్టకాలంలో కూడా నువ్వు ఒంటరిగా ఉండవు. ఆటగాళ్ల మద్దతు, నీ సపోర్ట్ స్టాఫ్, మాజీ లీడర్లు, మేనేజ్‌మెంట్ నీకు అండగా ఉంటుంది. భారత క్రికెట్ అభిమానుల కోసం నువ్వు ఆడావన్న విషయం మర్చిపోకు. వాళ్లు మనను డిమాండ్ చేస్తారు.. అలాగే జట్టుకు అండగా ఉంటారు. ఒక ఇండియన్ కోచ్ నుంచి.. మరో కోచ్‌కు చెప్పే చివరి విషయం ఏంటంటే.. చాలా కఠిన సమయాల్లో.. నీకు కష్టమైనా ఒక నవ్వు నవ్వు. ఏం జరిగినా.. అది జనాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గంభీర్.. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.. ఇంక నువ్వు ఇండియన్ క్రికెట్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాను.’ అని ద్రవిడ్ వాయిస్ రికార్డ్ చేసి గంభీర్‌కు పంపించాడు.
ద్రవిడ్ మెసేజ్‌పై గంభీర్ స్పందిస్తూ.. ‘దీనిపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఎందుకంటే.. ఈ మెసేజ్ నాకు ఎంతో విలువైనది. పైగా ఇది ఒక సక్సెస్‌ఫుల్ మాజీ కోచ్ నుంచి వచ్చినందుకు కూడా కాదు.. నేను చూసిన ఒక సెల్ఫ్‌లెస్ క్రికెటర్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇండియన్ క్రికెట్‌కు ఏం కావాలన్నా చేసిన వ్యక్తి రాహుల్ భాయ్. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి. నేనే కాదు.. వచ్చే తరం, ఇప్పటి తరం ఇండియన్ క్రికెట్ ఎంతో ముఖ్యమో ఆయనను చూసి నేర్చుకోవాలి. నేను పెద్దగా భావోద్వేగానికి గురి అయ్యే మనిషిని కాదు. కానీ, ఈ మెసేజ్ నన్ను ఎమోషనల్ చేసింది. ద్రవిడ్ గర్వపడేలా చేస్తానని అనుకుంటున్నాను’ అంటూ గంభీర్ పేర్కొన్నాడు. మరి ఈ ద్రవిడ్ నుంచి ఈ స్పెషల్ మెసేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝗣𝗮𝘀𝘀𝗶𝗻𝗴 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝘁𝗼𝗻 𝘄𝗶𝘁𝗵 𝗰𝗹𝗮𝘀𝘀 & 𝗴𝗿𝗮𝗰𝗲! 📝
To,
Gautam Gambhir ✉From,
Rahul Dravid 🔊#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0— BCCI (@BCCI) July 27, 2024