ICC ట్రోఫీలు నెగ్గాలంటే బాగా ఆడితే సరిపోదు.. అది కూడా తోడవ్వాలి: ద్రవిడ్

Rahul Dravid: 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ డ్రీమ్ ను పొట్టి ప్రపంచ కప్-2024ను గెలిచి నెరవేర్చుకుంది టీమిండియా. తదుపరి జరిగే ఐసీసీ ట్రోఫీలనూ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఛాంపియన్స్ గా నిలవడంపై మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ టోర్నీలో ఎలాంటి ప్లాన్స్ తో ముందుకెళ్లామో రివీల్ చేశాడు.

Rahul Dravid: 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ డ్రీమ్ ను పొట్టి ప్రపంచ కప్-2024ను గెలిచి నెరవేర్చుకుంది టీమిండియా. తదుపరి జరిగే ఐసీసీ ట్రోఫీలనూ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఛాంపియన్స్ గా నిలవడంపై మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ టోర్నీలో ఎలాంటి ప్లాన్స్ తో ముందుకెళ్లామో రివీల్ చేశాడు.

13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ డ్రీమ్ ను పొట్టి ప్రపంచ కప్-2024ను గెలిచి నెరవేర్చుకుంది టీమిండియా. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచింది భారత్. ఉత్కంఠగా జరిగిన ఫైనల్ లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ వరకు దూసుకొచ్చిన రోహిత్ సేన.. తుదిమెట్టుపై జారిపడి కప్పును చేజార్చుకుంది. కానీ టీ20 కప్పు విషయంలో మాత్రం తుదికంటా పోరాడుతూ ఛాంపియన్ గా నిలిచింది. తదుపరి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ నూ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది మెన్ ఇన్ బ్లూ. ఈ నేపథ్యంలో మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వరల్డ్ కప్ గెలవడం వెనుక సీక్రెట్ ఏదీ లేదన్నాడు ద్రవిడ్. తాము కొత్తగా ఏదీ ప్రయత్నించలేదని తెలిపాడు. వన్డే ప్రపంచ కప్-2023లో ఏదైతే చేశామో దాన్నే పొట్టి కప్పులోనూ కంటిన్యూ చేశామన్నాడు. 50 ఓవర్ల కప్ లో మన టీమ్ అద్భుతంగా ఆడిందన్న ద్రవిడ్.. ప్రతి ప్లేయర్ అదరగొట్టాడని మెచ్చుకున్నాడు. అదే ఎనర్జీని టీ20 వరల్డ్ కప్ లో కొనసాగించామని తెలిపాడు. ప్రిపరేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ పరంగా బెస్ట్ ఇచ్చామన్నాడు ద్రవిడ్. వరుసగా 10 మ్యాచ్ లు గెలిచామని, ఫైనల్ లోనూ అదరగొట్టామన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకున్నామని పేర్కొన్నాడు మాజీ కోచ్. అయితే వరల్డ్ కప్స్ లాంటి మేజర్ టోర్నీల్లో నెగ్గాలంటే బాగా ఆడితే సరిపోదని.. కొంచెం లక్ కూడా కలసిరావాలన్నాడు.

‘వన్డే వరల్డ్ కప్ లో ఏ ప్యాట్రన్ ను ఫాలో అయ్యామో దాన్నే టీ20 ప్రపంచ కప్ లోనూ అనుసరించాం. ప్రిపరేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ పరంగా ఇంతకుమించి చేయడానికి ఏమీ లేదు. మేం ఏదీ డిఫరెంట్ గా ప్లాన్ చేయలేదు. మేం సరిగ్గా ఏం చేయాలనే దాని గురించి ఆటగాళ్లందరికీ ఓ ఐడియా ఉంది. వన్డే వరల్డ్ కప్ ఎనర్జీ, వైబ్ ను క్రియేట్ చేశాం. టీమ్ వాతావరణం కూడా అలాగే ఉండేలా చూసుకున్నాం. జస్ట్ ఆ ఒక్క రోజు (ఫైనల్) అదృష్టం తోడుండాలని కోరుకున్నాం. అదే జరిగింది‘ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ ట్రోఫీలు నెగ్గాలంటే బాగా ఆడితేనే సరిపోదని.. లక్ కూడా కలసిరావాలని ది వాల్ వ్యాఖ్యానించాడు. సియట్ అవార్డ్స్ ఈవెంట్ లో ద్రవిడ్ ఈ కామెంట్స్ చేశాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ నెగ్గడం వెనుక ద్రవిడ్ తో పాటు జైషా, అగార్కర్ సపోర్ట్ ఉందన్నాడు. వాళ్ల మద్దతు వల్లే తాను చేయాలని అనుకున్నది చేశానని, ప్లేయర్ల శ్రమను కూడా మరవొద్దని వివరించాడు.

Show comments