వాళ్లకు ఎంతైతే ప్రైజ్‌మనీ ఇచ్చారో.. నాకు అంతే కావాలి: ద్రవిడ్‌

వాళ్లకు ఎంతైతే ప్రైజ్‌మనీ ఇచ్చారో.. నాకు అంతే కావాలి: ద్రవిడ్‌

Rahul Dravid, BCCI, Prize Money, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్‌కు బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్‌మనీలో తన ఎంతో కావాలో స్పష్టంగా చెప్పేసిన ద్రవిడ్‌. ఎంత అడిగాడో ఇప్పుడు చూద్దాం..

Rahul Dravid, BCCI, Prize Money, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్‌కు బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్‌మనీలో తన ఎంతో కావాలో స్పష్టంగా చెప్పేసిన ద్రవిడ్‌. ఎంత అడిగాడో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఏకంగా రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌ కప్‌తో ఇండియాకు తిరిగి వచ్చిన టీమిండియాను వాంఖడే స్టేడియంలో ఘనంగా సన్మానించిన బీసీసీఐ.. ఈ భారీ నగదు నజరానాను అందించింది. అయితే.. ఆ రూ.125 కోట్లలో జట్టులోని 15 మంది ఆటగాళ్లకు ఐదేసి కోట్లు ఇవ్వనున్నారు. అలాగే జట్టు హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌కు కూడా ఆటగాళ్లతో సమానంగా రూ.5 కోట్లు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే.. తనకు రూ.5 కోట్లు వద్దని రాహుల్‌ ద్రవిడ్‌ బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం.

తనకు కూడా తన కోచింగ్‌ స్టాఫ్‌కు ఇచ్చినంతే ఇవ్వాలని ద్రవిడ్‌ బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. రూ.125 కోట్లలో 15 మంది ఆటగాళ్లకు ఐదేసి కోట్లతో పాటు.. రాహుల్‌ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు, అలాగే అసిస్టెంట్‌ కోచ్‌లకు తలో రూ.2.5 కోట్లు, ఇతర సహాయక సిబ్బందిగా ఉన్న తొమ్మిది మందికి తలో రూ.2 కోట్లు ఇవ్వనున్నారు. వీరితో పాటు కప్పు కొట్టే టీమ్‌ను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులకు, రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు తలా రూ.కోటి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.

కానీ, ద్రవిడ్ మాత్రం అసిస్టెంట్‌ కోచ్‌లు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాజ్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌లకు ఎలా అయితే తలో రూ.2.5 కోట్లు ఇస్తున్నారో.. తనకూ వాళ్ల అంతే ఇవ్వాలని, 5 కోట్లు వద్దని బీసీసీఐని రిక్వెస్ట్‌ చేశాడు. ఈ నిర్ణయంతో ద్రవిడ్‌ రూ.2.5 కోట్లు నష్టపోనున్నాడు. మరి ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ద్రవిడ్‌ కోరినట్లు వాళ్లతో సమానంగా ద్రవిడ్‌కు కూడా రూ.2.5 కోట్లు ఇస్తుందా? లేక ముగ్గురు అసిస్టెంట్‌ కోచ్‌లకు ఇచ్చే ప్రైజ్‌మనీని మరి కాస్త పెంచి ద్రవిడ్‌ను బుజ్జగిస్తుందా? అనే వేచి చూడాలి. మరి తన కోచింగ్‌ టీమ్‌ కోసం ద్రవిడ్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments