iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ కి ముందు ఆటగాళ్లకు ద్రవిడ్ హెచ్చరిక!

  • Published Jun 03, 2024 | 12:59 PM Updated Updated Jun 03, 2024 | 12:59 PM

వరల్డ్ కప్ లో మెుదటి మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్లను హెచ్చరించాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ విషయం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వరల్డ్ కప్ లో మెుదటి మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్లను హెచ్చరించాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ విషయం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ కి ముందు ఆటగాళ్లకు ద్రవిడ్ హెచ్చరిక!

టీ20 వరల్డ్ కప్ 2024 కప్ కొట్టాలని అమెరికాలో అడుగుపెట్టింది టీమిండియా. ఈసారి ఎలాగైనా కప్ తోనే ఇండియాకు తిరిగి వెళ్లాలని జట్టు భావిస్తోంది. అందులో భాగంగానే కఠోరంగా నెట్స్ లో శ్రమిస్తోంది. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలర్లను ఎదుంటూ భారీ స్కోర్ చేసింది . పంత్, హార్దిక్ పాండ్యాలు ఈ మ్యాచ్ లో మెరిశారు. అయితే భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడినప్పటికీ.. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్లేయర్లను హెచ్చరించాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. మరి వరల్డ్ కప్ మెుదటి మ్యాచ్ కు ముందు.. ఏ విషయంలో ద్రవిడ్ ఈ హెచ్చరికలను జారీ చేశాడు? తెలుసుకుందాం పదండి.

పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లోని నాసౌవ్ కౌంటీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ గ్రౌండ్ లో ఆడేటప్పుడు ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్లేయర్లను హెచ్చరించాడు. ఈ గ్రౌండ్ గురించి రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ..

“బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో మా ప్లేయర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించారు. పిచ్ ఎలా మారుతుంది? ఎలా ఉంటుంది? అన్న విషయంపై మాకు ఓ అవగాహన వచ్చింది. ఈ గ్రౌండ్ లో ప్లేయర్లు ఫీల్డింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే? ఈ మైదానం చాలా సాఫ్ట్ గా ఉంది. దాంతో ఇది కండరాలపై ప్రభావం చూపి, గాయాలబారిన పడే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్లేయర్లు ఫోకస్ పెట్టాలి. గ్రౌండ్ కింద ఎక్కువ ఇసుకతో నింపినట్లు. స్పాంజిలా అనిపించింది. రిథమ్ అందుకోవడం కోసం కష్టపడాలి. అందుకే గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి” అని తొలి మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్లకు ద్రవిడ్ హెచ్చరికలు పంపాడు. ఇలాంటి మైదానాల్లో ప్లేయర్లు ఎక్కువగా గాయపడటానికి అవకాశాలు ఉన్నాయని ద్రవిడ్ ముందుగానే పసిగట్టి.. ఆటగాళ్లకు జాగ్రత్తలు చెబుతున్నాడు.

ఇదిలా ఉంటే.. నాసౌవ్ కౌంటీ స్టేడియంలో టీమిండియా మూడు మ్యాచ్ లను ఆడనుంది. మరో మ్యాచ్ ఫ్లోరిడాలో ఆడనుంది. ప్రపంచమంతా ఎదురుచూసే భారత్-పాక్ మ్యాచ్ కూడా ఈ గ్రౌండ్ లోనే జరగనుంది. దాంతో ప్లేయర్లకు ఇంజ్యూరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ముందే భావించి.. ఈ విధమైన సూచనలు చేశాడు రాహుల్ ద్రవిడ్. ఇక ఈ మెగాటోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను ఢీకొనబోతోంది. జూన్ 5న ఈ మ్యాచ్ జరగనుంది. మరి గాయాల విషయంలో ఆటగాళ్లకు ద్రవిడ్ హెచ్చరికలు పంపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.