iDreamPost
android-app
ios-app

రెహ్మానుల్లా గుర్బాజ్ సూపర్ సెంచరీ.. సౌతాఫ్రికా బౌలర్లకు పోయించాడు!

  • Published Sep 20, 2024 | 9:18 PM Updated Updated Sep 20, 2024 | 9:18 PM

Rahmanullah Gurbaz Smashes Century: క్రికెట్​లో టాప్ టీమ్స్​లో ఒకటైన సౌతాఫ్రికాను భయపెడుతోంది ఆఫ్ఘానిస్థాన్. పట్టుదలతో ఆడుతూ సఫారీల పని పడుతున్నారు ఆఫ్ఘాన్ వీరులు. తొలి వన్డేలో ఆ జట్టును చిత్తు చేశారు. రెండో వన్డేలోనూ ప్రొటీస్​కు షాక్ ఇచ్చేలాగే ఉన్నారు.

Rahmanullah Gurbaz Smashes Century: క్రికెట్​లో టాప్ టీమ్స్​లో ఒకటైన సౌతాఫ్రికాను భయపెడుతోంది ఆఫ్ఘానిస్థాన్. పట్టుదలతో ఆడుతూ సఫారీల పని పడుతున్నారు ఆఫ్ఘాన్ వీరులు. తొలి వన్డేలో ఆ జట్టును చిత్తు చేశారు. రెండో వన్డేలోనూ ప్రొటీస్​కు షాక్ ఇచ్చేలాగే ఉన్నారు.

  • Published Sep 20, 2024 | 9:18 PMUpdated Sep 20, 2024 | 9:18 PM
రెహ్మానుల్లా గుర్బాజ్ సూపర్ సెంచరీ.. సౌతాఫ్రికా బౌలర్లకు పోయించాడు!

క్రికెట్​లో టాప్ టీమ్స్​లో ఒకటైన సౌతాఫ్రికాను భయపెడుతోంది ఆఫ్ఘానిస్థాన్. పట్టుదలతో ఆడుతూ సఫారీల పని పడుతోంది. ఏ మాత్రం భయం లేకుండా ఆడుతూ వాళ్లను షేక్ చేస్తోంది. బిగ్ టీమ్​కు ఫియర్ ఎలా ఉంటుందో పరిచయం చేస్తోంది. తొలి వన్డేలో ప్రొటీస్​ను చిత్తు చేసిన ఆఫ్ఘాన్ వీరులు.. రెండో వన్డేలోనూ ఆ టీమ్​కు షాక్ ఇచ్చేలాగే ఉన్నారు. ఈ దిశగా ఇప్పటికే భారీ అడుగులు పడ్డాయి. ఆఫ్ఘాన్-సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే ఆసక్తికరంగా జరుగుతోంది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ఆఫ్ఘాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే తొలి వన్డేలో ఓడి కసి మీద ఉన్న సఫారీలు ఆ టీమ్​ బ్యాటింగ్ ఆర్డర్​ను తక్కువ స్కోరుకే కూలుస్తారనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ పిడుగులా ప్రొటీస్ మీద పడ్డాడు. మెరుపు సెంచరీతో ప్రత్యర్థితో ఓ ఆటాడుకున్నాడు.

ఫస్ట్ ఓవర్ నుంచి సౌతాఫ్రికాను వణకించాడు గుర్బాజ్. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ వాయించి వదిలేశాడు. స్టార్ పేసర్లు లుంగీ ఎంగిడీ, నండ్రీ బర్గర్​తో పాటు నకాబా పీటర్​ బౌలింగ్​లో భారీగా పరుగులు పిండుకున్నాడు. వ్లాన్ ముల్డర్​ను కూడా ఉతికి ఆరేశాడు. మొత్తంగా 110 బంతుల్లో 105 పరుగులు చేశాడు గుర్బాజ్. ఇందులో 10 బౌండరీలు, 3 సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 58 పరుగులు పిండుకున్నాడు రెహ్మానుల్లా. భారీ షాట్లు బాదుతూనే మధ్యలో స్ట్రైక్ రొటేషన్​కు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సింగిల్స్​ను డబుల్స్​గా కన్వర్ట్ చేస్తూ సౌతాఫ్రికా ఫీల్డర్లను ఒత్తిడిలో పెట్టాడు. ఈ నాక్​తో ప్రొటీస్​ మీద వన్డేల్లో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘాన్ బ్యాటర్​గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక, గుర్బాజ్​కు తోడుగా రెహ్మత్ షా (66 బంతుల్లో 50) రాణించడంతో ఆ టీమ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.

గుర్బాజ్, రెహ్మత్ ఔట్ అయినా ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయి ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. అతడు పవర్ హిట్టింగ్​తో అదరగొడుతున్నాడు. 34 బంతుల్లో 52 పరుగులు చేసిన ఒమర్జాయి ఇంకా క్రీజులోనే ఉన్నాడు. మరో ఎండ్​లో ఉన్నాడు సీనియర్ ఆల్​రౌండర్ మహ్మద్ నబీ (9 నాటౌట్). ఆఫ్ఘాన్ ఇప్పుడు 44.2 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 260 పరుగులతో ఉంది. ఈజీగా మరో 50 నుంచి 60 పరుగులు చేసేలా ఉంది. ఆ టీమ్ బ్యాటర్లు ఇంకా చెలరేగితే స్కోరు 330 వరకు వెళ్లొచ్చు. ఆల్రెడీ తొలి వన్డేలో ఓడి భారీ విమర్శలు మూటగట్టుకున్న సౌతాఫ్రికా ఈ మ్యాచ్​లోనూ ఓడితే సిరీస్ కోల్పోతుంది. అదే జరిగితే ప్రోటీస్​ మీద మరింత ట్రోలింగ్ జరగడం ఖాయం. మరి.. గుర్బాజ్ సెంచరీ నాక్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.