iDreamPost

చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్ ఓపెనర్లు.. కోహ్లీ-రోహిత్ రికార్డ్ బ్రేక్!

టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఆఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్-ఇబ్రహీం జద్రాన్ జోడీ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే దిగ్గజాలు నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఆఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్-ఇబ్రహీం జద్రాన్ జోడీ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే దిగ్గజాలు నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్ ఓపెనర్లు.. కోహ్లీ-రోహిత్ రికార్డ్ బ్రేక్!

ఆఫ్గానిస్తాన్.. టీ20 ప్రపంచ కప్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది. ఈ టోర్నీ లీగ్ దశలో న్యూజిలాండ్ ను ఓడించి.. ఆశ్చర్యానికి గురిచేసిన ఆ టీమ్, తాజాగా సూపర్ 8లో ఏకంగా ఆస్ట్రేలియాకే షాకిచ్చింది. ఈ విజయంతో వరల్డ్ క్రికెటే సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు ఆఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్-ఇబ్రహీం జద్రాన్. ఏకంగా ఆసీస్ దిగ్గజాలు అయిన మాథ్యూ హెడెన్-గిల్ క్రిస్ట్ లతో పాటుగా విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల క్రేజీ రికార్డ్స్ ను బద్దలు కొట్టారు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే?

టీ20 వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు ఆఫ్గానిస్తాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్-ఇబ్రహీం జద్రాన్. టోర్నీ ఆరంభం నుంచి ఈ జోడీ జట్టుకు అద్భుతమైన శుభారంభాలు ఇస్తూ.. టీమ్ విజయాలకు తోల్పడుతోంది. ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఈ టోర్నీలో అత్యుత్తమ ఓపెనర్లుగా కితాబు అందుకుంటున్నారు గుర్బాజ్-జద్రాన్ జోడీ. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సైతం గొప్పగా రాణించి.. తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే దిగ్గజాలు నెలకొల్పిన రికార్డ్ ను బద్దలు కొట్టింది ఈ ఆఫ్గాన్ జోడీ.

AFG openers

అంతర్జాతీయ పురుషుల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్ లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనర్లుగా చరిత్ర సృష్టించారు గుర్బాజ్-జద్రాన్ జోడీ. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటికే 3 శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఉగాండ, న్యూజిలాండ్ లపై ఈ ఆఫ్గాన్ ఓపెనర్లు సెంచరీ పార్ట్ నర్ షిప్స్ నెలకొల్పారు. తాజాగా ఆస్ట్రేలియాపై కూడా ఈ ఫీట్ ను సాధించారు. వరల్డ్ క్లాస్ బౌలర్లుగా పేరుగాంచిన కంగారూ బౌలర్లను ఎదుర్కొంటూ.. తొలి వికెట్ కు ఏకంగా 118 పరుగుల పార్ట్ నర్ షిప్ ను జోడించారు. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన జంటగా ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.

ఈ క్రమంలోనే 2007 వరల్డ్ కప్ లో మాథ్యూ హెడెన్-ఆడమ్ గిల్ క్రిస్ట్( 2 సెంచరీ భాగస్వామ్యాలు), 2014 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ(2 సెంచరీ పార్ట్ నర్ షిప్), బాబర్-రిజ్వాన్(2) రికార్డులను బద్దలు కొట్టారు. దాంతో ఈ జోడీపై వరల్డ్ వైడ్ గా ప్రశంసలు కురుస్తున్నాయి. మరి హేమా హేమీలకు సైతం సాధ్యం కాని అరుదైన ఘనత తమ పేరిట లిఖించుకున్న ఆఫ్గాన్ ఓపెనర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి