ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటూనే బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. ఎంత టాలెంట్ ఉన్న ప్లేయర్లు అయినా ఓవర్ వెయిట్ ఉంటే వారిని తీసుకునేందుకు టీమ్స్ పెద్దగా ఆసక్తి చూపవు. కొన్ని ఆటల్లో అయితే ఆటగాళ్ల బరువుకు సంబంధించి కచ్చితమైన రూల్స్ కూడా ఉన్నాయి.
ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటూనే బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. ఎంత టాలెంట్ ఉన్న ప్లేయర్లు అయినా ఓవర్ వెయిట్ ఉంటే వారిని తీసుకునేందుకు టీమ్స్ పెద్దగా ఆసక్తి చూపవు. కొన్ని ఆటల్లో అయితే ఆటగాళ్ల బరువుకు సంబంధించి కచ్చితమైన రూల్స్ కూడా ఉన్నాయి.
స్పోర్ట్స్‌లో ఫిట్నెస్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిక్షణం హుషారుగా, చురుగ్గా ఉంటేనే ఆటల్లో రాణించగలం. ముఖ్యంగా ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ లాంటి ఔట్‌డోర్ గేమ్స్‌లో ఫిట్‌గా ఉండటం తప్పనిసరి. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటూనే బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. ఎంత టాలెంట్ ఉన్న ప్లేయర్లు అయినా ఓవర్ వెయిట్ ఉంటే వారిని తీసుకునేందుకు టీమ్స్ పెద్దగా ఆసక్తి చూపవు. కొన్ని ఆటల్లో అయితే ఆటగాళ్ల బరువుకు సంబంధించి కచ్చితమైన రూల్స్ కూడా ఉన్నాయి. కానీ క్రికెట్లో దీన్ని అంతగా పట్టించుకోరు. బరువు కాస్త ఎక్కువగా ఉన్నా, ప్రతిభ ఉంటే క్రికెటర్లను ఆడిస్తుంటారు.
భారత జట్టులోనూ ఆటగాళ్లు బరువు ఎక్కువగా ఉన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ విరాట్ కోహ్లీ జట్టుకు కెప్టెన్ అయ్యాక ఇందులో మార్పు వచ్చింది. ఆటగాళ్లు తప్పకుండా ఫిట్‌గా ఉండాల్సిందేనని రూల్ వచ్చింది. ఇప్పుడు కూడా టీమ్ మేనేజ్మెంట్ అదే ఫాలో అవుతోంది. ప్లేయర్ల ఫిట్నెస్ను పరీక్షించేందుకు క్రమం తప్పకుండా యోయో టెస్టులు కూడా పెడుతోంది. అయితే దీనిపై వెటరన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ లాంటి వాళ్లు విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్లేయర్లు కాస్త బొద్దుగా ఉంటే వచ్చే ఇబ్బందేంటని ఒకసారి గవాస్కర్ ప్రశ్నించారు. బరువు కంటే గేమ్ చాలా ముఖ్యమని చెప్పారు. కాగా, వరల్డ్ టెస్ట్ సిరీస్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న టీమిండియా ప్లేయర్లు.. ఎట్టకేలకు గ్రౌండ్లోకి దిగారు.
వెస్టిండీస్‌లో భారత పర్యటన షురూ అయింది. ఈ ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఇవాళ మొదలైంది. అనూహ్యంగా విండీస్ టీమ్‌లో భారీకాయుడు రకీం కార్న్‌వాల్‌కు చోటు దక్కింది. రెండు సంవత్సరాల విరామం తర్వాత ఈ మహా ఆల్‌రౌండర్‌కు ఛాన్స్ ఇచ్చింది టీమ్ మేనేజ్మెంట్. ప్రస్తుత క్రికెట్లో అత్యంత బరువైన ప్లేయర్‌గా కార్న్‌వాల్ నిలిచాడు. ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్న ఈ ఆల్‌రౌండర్ బరువు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 140 కిలోల బరువు ఉన్న కార్న్‌వాల్.. ఉపయుక్తమైన స్పిన్ ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండేళ్ల గ్యాప్ అనంతరం రీఎంట్రీ ఇచ్చిన కార్న్‌వాల్.. భారత్‌తో మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. కాగా, ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఊహించినట్లే తడబడుతోంది. ఆ జట్టు 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 55 రన్స్ చేసింది. అశ్విన్, శార్దూల్ ఠాకూర్ కలసి ప్రత్యర్థి టాపార్డర్ పనిపట్టారు.