iDreamPost
android-app
ios-app

Suresh Raina: ఆ జట్టుకు హెడ్​ కోచ్​గా సురేష్ రైనా.. ఇక ట్రోఫీ కొట్టడమే తరువాయి!

  • Published Jul 24, 2024 | 5:11 PM Updated Updated Jul 24, 2024 | 5:11 PM

టీమిండియా లెజెండ్ సురేష్ రైనాకు సంబంధించి ఇప్పుడో విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ టీమ్​కు హెడ్ కోచ్​గా రైనా వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.

టీమిండియా లెజెండ్ సురేష్ రైనాకు సంబంధించి ఇప్పుడో విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ టీమ్​కు హెడ్ కోచ్​గా రైనా వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.

  • Published Jul 24, 2024 | 5:11 PMUpdated Jul 24, 2024 | 5:11 PM
Suresh Raina: ఆ జట్టుకు హెడ్​ కోచ్​గా సురేష్ రైనా.. ఇక ట్రోఫీ కొట్టడమే తరువాయి!

సురేష్ రైనా.. క్రికెట్​కు భారత్ అందించిన ఆణిముత్యాల్లో ఒకడు. అద్భుతమైన లెఫ్టాండ్ బ్యాటింగ్​తో ఎన్నో మ్యాచుల్లో టీమిండియాను గెలిపించాడు రైనా. బ్యాటింగ్​తో పాటు సూపర్బ్ ఫీల్డింగ్​తోనూ క్రికెట్​ మీద తనదైన ముద్ర వేశాడు. 30 యార్డ్స్ సర్కిల్​తో పాటు బౌండరీ లైన్ ఫీల్డింగ్​లోనూ తోపుగా పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో క్వాలిటీ ఆఫ్ స్పిన్ బౌలింగ్​తో కూడా జట్టుకు చేదోడు వాదోడుగా నిలిచాడు. వన్డే వరల్డ్ కప్-2011ను మెన్ ఇన్ బ్లూ అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. కెరీర్​లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​తో పాటు ఐపీఎల్​లోనూ లెజెండ్​గా కెరీర్​ను ముగించిన రైనా ఇప్పుడు కామెంట్రీ లాంటివి చేస్తూ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తున్నాడు.

కోచ్​గా రమ్మంటూ పలు జట్ల నుంచి ఆఫర్లు వచ్చినా రైనా వద్దన్నాడని తెలుస్తోంది. భారీ ఆఫర్లు ఇచ్చినా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి, కొన్నాళ్లు సీరియస్ క్రికెట్​కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే అతడు ఈ డెసిషన్ తీసుకున్నాడని వినికిడి. అయితే మొత్తానికి ఓ జట్టుకు హెడ్ కోచ్​గా వెళ్లేందుకు అతడు అంగీకరించాడని టాక్ నడుస్తోంది. ఐపీఎల్​ టీమ్ అయిన పంజాబ్ కింగ్స్​కు కొత్త కోచ్​గా రైనాను నియమించడం దాదాపుగా ఖాయమైందని క్రికెట్ వర్గాల సమాచారం. ఐపీఎల్-2025కు ముందు కోచ్​ను మార్చాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోందట. పాత కోచ్ ట్రెవర్ బేలిస్​ను తొలగించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.

ట్రెవర్ బేలిస్ స్థానంలో సురేష్ రైనాను రీప్లేస్ చేయాలని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఫిక్స్ అయిందని వినిపిస్తోంది. ఒక్కసారి కూడా కప్పు అందుకోని పంజాబ్​ను ఎలాగైనా విజేతను చేయాలని ఓనర్స్ భావిస్తున్నారట. అందుకోసం మంచి కోచ్​తో పాటు మెగా ఆక్షన్​లో టాప్ ప్లేయర్లను తీసుకోవడం, అలాగే సరైనోడ్ని కెప్టెన్​ చేయాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే బేలిస్ స్థానంలో రైనాకు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తున్నారట. టీమ్​పై అథారిటీ, ఫ్రీడమ్ ఇస్తుండటంతో రైనా కూడా వాళ్ల ఆఫర్​కు ఓకే చెప్పాడని.. అధికారిక ప్రకటనే తరువాయి అని సమాచారం. రైనాతో పాటు దిగ్గజాలు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్​ను కూడా కోచింగ్ కోసం పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే యువీ గుజరాత్​ టీమ్​కు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం, వీరూ కంటే రైనా బెటర్ ఆప్షన్ అనే ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. మరి.. రైనా వస్తే పంజాబ్ రాత మారుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.