SNP
Punjab Kings, KKR vs PBKS: టీ20 క్రికెట్ పుట్టిన ఇన్నేళ్లుకు ఓ అద్భుతం చోటు చేసుకుంది. అది కూడా ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా కప్పు కొట్టని టీమ్ ఈ చరిత్ర సృష్టించింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Punjab Kings, KKR vs PBKS: టీ20 క్రికెట్ పుట్టిన ఇన్నేళ్లుకు ఓ అద్భుతం చోటు చేసుకుంది. అది కూడా ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా కప్పు కొట్టని టీమ్ ఈ చరిత్ర సృష్టించింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ చరిత్రలోనే కాదు.. యావత్ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలి సారి ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఓ జట్టు 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. ప్రపంచ క్రికెట్‌లో ఇంత పెద్ద టార్గెట్‌ను ఛేజ్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఆ టీమ్ పేరు పంజాబ్ కింగ్స్. ఐపీఎల్‌లో ఒక్క ట్రోఫీ లేకపోయినా.. వారి ఆటకు ఫిదా కానీ ఫ్యాన్స్ ఉండరు. మ్యాచ్ చివరి ఓవర్ పోరాడి ఓడిపోయే పంజాబ్.. ఈ సారి అలాంటి తప్పుచేయండా.. 262 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేస్తూ.. అసలు మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు వెళ్లనివ్వలేదు. ఐపీఎల్ 2024లో శుక్రవారం కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తలపడింది. ఈ మ్యాచ్ కొత్త చరిత్రకు వేదికైంది. టీ20 క్రికెట్‌లో అత్యంత భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన టీమ్‌గా పంజాబ్ కింగ్స్ కొత్త చరిత్రను లిఖించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, పంజాబ్ బౌలర్లను చీల్చి చెండాడింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్.. ఆరంభం నుంచి ఒకటే కొట్టుడు. ఈ ఓపెనింగ్ ఓడీ 10.2 ఓవర్లలో ఏకంగా 138 పరుగులు చేసింది. 32 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సులతో 71 పరుగులు చేసి నరైన్ తొలి వికెట్‌గా అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇచ్చిన అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌పై తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా రెచ్చిపోయి ఆడారు. సాల్ట్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 75, వెంకటేష్ అయ్యర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 39, రస్సెల్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 24, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 28 పరుగులు.. ఇలా వచ్చిన వారు వచ్చినట్లు ఫోర్లు సిక్సులతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
పంజాబ్ జట్టులోని ప్రధాన బౌలర్ కగిసో రబాడ కేవలం 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసి ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు కేకేఆర్ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో. మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి.. పంజాబ్ ముందు 262 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌కు.. ఆ జట్టు యువ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో 54 పరుగులు చేసి.. మరో ఎండ్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్టార్ జానీ బెయిర్‌స్టోనే బిత్తరపోయేలా ఆడాడు. కుర్రాడే అలా ఆడుతుంటే.. నేను ఇంకేలా ఆడాలని అనుకున్నాడో ఏమో.. ఫూర్ ఫామ్‌లో ఉన్న బెయిర్ స్టో.. ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి రావడమే కాదు.. ఏకంగా సెంచరీతో కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒక్కసారి తాను తన ఫామ్‌ను అందుకుంటే ఏ రేంజ్‌లో ఉంటుందో బెయిర్‌స్టో చూపించాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సులతో 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అలాగే రిలీ రోసోవ్ కొద్ది సేపు పర్వాలేదనించాడు. 16 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులతో 26 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. రోసోవ్ అవుట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శశాంక్ సింగ్.. నెక్ట్స్ లెవెల్ విధ్వంసం సృష్టించాడు. బెయిర్ స్టో 90ల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన శశాంక్.. బెయిర్‌స్టో 108కి చేరుకునే సరికి.. శశాంక్ 28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సులతో 68 పరుగులు చేసి.. 262 పరుగుల భారీ టార్గెట్‌ను అసలు లెక్కచేయకుండా కొట్టేశాడు. ఇంత పెద్ద టార్గెట్‌ను ఛేజ్ చేయడమే గొప్ప అనుకుంటే.. మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఊదిపారేసింది పంజాబ్. ఈ మ్యాచ్ తర్వాత పంజాబ్ అంటే ప్రత్యర్థి జట్లు భయపడటం ఖాయం. మరి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన పంజాబ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
T20 started in 2003.
21 years later, Punjab Kings chase down the highest total in T20 history. 👑🤯 pic.twitter.com/nA3eKoDrrU
— Johns. (@CricCrazyJohns) April 26, 2024