Somesekhar
కీరన్ పొలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్ ధాటికి.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ వృథాగా మారింది. సిక్సులు, ఫోర్లతో పెషావర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఈ విండీస్ మాజీ ప్లేయర్.
కీరన్ పొలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్ ధాటికి.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ వృథాగా మారింది. సిక్సులు, ఫోర్లతో పెషావర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఈ విండీస్ మాజీ ప్లేయర్.
Somesekhar
కీరన్ పొలార్డ్.. క్రీజ్ లో ఉన్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. తనకున్న హ్యాండ్ పవర్ తో బాల్ ను బలంగా కొట్టాడంటే.. ఇక అంతే సంగతులు. బాల్ బౌండరీ అవతల కాదు.. ఏకంగా గ్రౌండ్ వెలుపలే పడుతుంది. ఇక ఇలాంటి సిక్సులు పొలార్డ్ కెరీర్ లో ఎన్నో బాదాడు. అయితే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పలు క్రికెట్ లీగ్ ల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 సీజన్ లో కరాచీ కింగ్స్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో భాగంగా తాజాగా పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్ లో సుడిగాలి ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు విండీస్ విధ్వంసకర వీరుడు. దీంతో బాబర్ అజామ్ వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృథా కాక తప్పలేదు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ లో దుమ్మురేపాడు కరాచీ కింగ్ ప్లేయర్, విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్. పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఎడాపెడా సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడిన పొలార్డ్ గ్రౌండ్ లో పూనకాలు తెప్పించాడు. సుడిగాలి ఇన్నింగ్స్ తో కేవలం 21 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాక.. జట్టుకు విజయాన్ని అందించాడు. పొలార్డ్ విధ్వంసానికి కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది కరాచీ కింగ్స్ టీమ్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ టీమ్ 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఒక్కడే 72 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్ లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు బాబర్. అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో(271) 10 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అయితే పొలార్డ్ థండర్ ఇన్నింగ్స్ ముందు బాబర్ ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ వృథాగా మారిపోయింది. దీంతో పొలార్డ్ లో ఇంకా చేవ తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్. వింటేజ్ పొలార్డ్ ను చూపించావని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విండీస్ ప్లేయర్ థండర్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
He’s still got it 🥶pic.twitter.com/kthsVbhdf3
— CricTracker (@Cricketracker) February 21, 2024
ఇదికూడా చదవండి: 6 బంతుల్లో 6 సిక్సులు.. టీ20లో కాదు భయ్యా.. టెస్టుల్లో!