Somesekhar
చివరి బాల్ కు విన్నింగ్ షాట్ కొట్టి పీఎస్ఎల్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది ఇస్లామాబాద్ టీమ్. ముచ్చటగా మూడోసారి ఈ టైటిల్ ను ముద్దాడింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
చివరి బాల్ కు విన్నింగ్ షాట్ కొట్టి పీఎస్ఎల్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది ఇస్లామాబాద్ టీమ్. ముచ్చటగా మూడోసారి ఈ టైటిల్ ను ముద్దాడింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
భారీ స్కోర్లూ నమోదు కాలేదు.. బ్యాటర్ల మెరుపులూ లేవు. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ మాత్రం క్రికెట్ లవర్స్ కు మస్త్ మజాను ఇచ్చింది. సోమవారం(మార్చి 18)న కరాచీ వేదికగా జరిగిన టైటిల్ పోరులో ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ ఇస్లామాబాద్ యూనైటెడ్ జట్లు తలపడ్డాయి. చివరి బాల్ వరకూ నరాలు తెగే ఉత్కంఠంగా సాగింది ఈ మ్యాచ్. చివరి బాల్ కు విన్నింగ్ షాట్ కొట్టి పీఎస్ఎల్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది ఇస్లామాబాద్ టీమ్. ముచ్చటగా మూడోసారి ఈ టైటిల్ ను ముద్దాడింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఛాంపియన్ గా ఇస్లామాబాద్ యూనైటెడ్ టీమ్ నిలిచింది. కరాచీ వేదికగా జరిగిన తుదిపోరులో 2 వికెట్ల తేడాతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును మట్టికరిపించింది. లీగ్ ఆద్యంతం సూపర్ ఆటను ప్రదర్శించిన ఇస్లామాబాద్ టీమ్.. ఫైనల్లోనూ అదే ఆటతీరును కొనసాగించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. జట్టులో ఉస్మాన్ ఖాన్ ఒక్కడే 57 రన్స్ తో రాణించాడు. చివర్లో ఇఫ్తికర్ అహ్మద్ 3 ఫోర్లు, 3 సిక్సులతో 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వారందరూ మూకుమ్మడిగా విఫలం అయ్యారు. ఇమద్ వసీమ్ 5 వికెట్లతో చెలరేగాడు.
తర్వాత 160 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ టీమ్ 8 వికెట్లు నష్టపోయి చివరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా.. మహ్మద్ అలీ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి ఇమద్ వసీమ్ సింగిల్ తీశాడు. ఆ నెక్ట్స్ బాల్ ను నసీమ్ షా బౌండరీ తరలించాడు. దీంతో అందరూ విజయం ఖాయమైందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా నసీమ్ షా ఔట్ కావడంతో.. ఉత్కంఠ నెలకొంది. స్కోర్లు సమం కాగా.. చివరి బంతికి ఒక రన్ కొడితే ఇస్లామాబాద్ విజయం సాధిస్తుంది. నషీమ్ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హునైన్ షా ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌండరీ బాది జట్టుకు టైటిల్ ను అందించాడు. దీంతో థర్డ్ టైమ్ పీఎస్ఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది ఇస్లామాబాద్. గతంలో 2016, 2018 లో ఛాంపియన్ గా నిలిచింది. చివరి వరకూ క్షణక్షణం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చింది. మరి మూడుసార్లు పీఎస్ఎల్ టైటిల్ ను గెలిచిన ఇస్లామాబాద్ టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
SHAH BROTHERS ARE TOTAL CLUTCH 🔥👌pic.twitter.com/cyOa0vK8xo
— Johns. (@CricCrazyJohns) March 18, 2024
ఇదికూడా చదవండి: వీడియో: తిలక్ వర్మ సిక్సుల మోత.. తెలుగోడి దెబ్బకు దద్దరిల్లిన స్టేడియం