iDreamPost
android-app
ios-app

VIDEO: ఇదేం ఔట్‌ రా బాబు! పాపం పృథ్వీ షా.. ప్లేస్‌ మారినా ఫేట్‌ మారలేదు

  • Published Aug 05, 2023 | 9:01 AMUpdated Aug 05, 2023 | 9:01 AM
  • Published Aug 05, 2023 | 9:01 AMUpdated Aug 05, 2023 | 9:01 AM
VIDEO: ఇదేం ఔట్‌ రా బాబు! పాపం పృథ్వీ షా.. ప్లేస్‌ మారినా ఫేట్‌ మారలేదు

క్రికెట్‌లో కొన్నిసార్లు జరిగే సంఘటనలు అస్సలు నమ్మశక్యంగా ఉండవు. అదృష్టం బాగాలేకుంటే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనే సామెత అనేకసార్లు క్రికెట్‌లో కొందరు ఆటగాళ్లకు, వాళ్ల పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విషయం.. టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షాకు బాగా నప్పుతుంది. టీమిండియా అతి చిన్న వయసులో తారా జువ్వలా దూసుకొచ్చిన షా.. తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు. మరో వీరేందర్‌ సెహ్వాగ్‌ అంటూ ప్రశంసలు అందుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఎక్కువకాలం టీమ్‌లో నిలువలేకపోయాడు. టాలెంట్‌కు కొదవలేకపోయినా.. నిలకడలేమి అతనికి శాపంగా మారింది. పైగా వ్యక్తిగత జీవితంలో వివాదాలు, ఆటలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతుండటంతో ప్రస్తుతం పృథ్వీ షా తన ఆటను పదును పెట్టేడంపై వంద శాతం ఎఫర్ట్‌ పెడుతున్నాడు. కానీ, మళ్లీ మళ్లీ అతన్ని దురదృష్టం వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది.

తిరిగి ఫామ్‌ అందుకునేందుకు కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్న పృథ్వీ షా ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌ షైర్‌ తరఫున అరంగేట్రం చేశాడు. శుక్రవారం రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో భాగంగా గ్లౌసెస్టర్‌ షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా మరీ దారుణంగా అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం అతని అవుట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో 35 పరుగులతో క్రీజ్‌లో కుదురుకుని.. లాంగ్‌ ఇన్నింగ్స్‌ దిశగా సాగుతున్న క్రమంలో పృథ్వీ షా షాట్‌ ఆడుతూ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతని షూ పొరపాటున దురదృష్టం కొద్ది వికెట్లకు తాకింది. దీంతో అంపైర్‌ అతన్ని హిట్‌ వికెట్‌గా ప్రకటించాడు.

దీంతో.. పృథ్వీ షా కొద్ది సేపు అలానే కూర్చోని.. ఏంటి నా తలరాత ఇలా ఉంది అని అనుకున్నట్లుగా ఫేస్‌ పెట్టాడు. ఈ ఘటన నార్తాంప్టన్‌ షైర్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో చోటు చేసుకుంది. పేసర్‌ పాల్‌ వాన్‌ మీకెరెన్‌ వేసిన బౌన్సర్‌కు పృథ్వీషా పుల్‌ షాట్‌ ఆడబోయాడు. కానీ.. నియంత్రణ కోల్పోయి కిందపడిపోయాడు. దీంతో అతని షూ స్టంప్స్‌కు తాకింది. దీంతో అతను హిట్‌ వికెట్‌ రూపంలో అవుట్‌ అయ్యాడు. షా అవుట్‌పై సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది. ఇండియా నుంచి ఇంగ్లండ్‌ వెళ్లినా.. షాకు ఏదీ కలిసిరావడం లేదు పాపం అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కాలర్ పట్టుకుని నన్ను తోసేశాడు! సంచలన విషయం బయటపెట్టిన సెహ్వాగ్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి