iDreamPost
android-app
ios-app

భారత కెప్టెన్‌కు అవమానం! విరుచుకుపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

  • Published Jul 21, 2023 | 10:42 AM Updated Updated Jul 21, 2023 | 10:42 AM
  • Published Jul 21, 2023 | 10:42 AMUpdated Jul 21, 2023 | 10:42 AM
భారత కెప్టెన్‌కు అవమానం! విరుచుకుపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

భారత క్రికెటర్లకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లకు కూడా కొంతకాలంగా మంచి గుర్తింపు లభిస్తోంది. మెన్స్‌ టీమ్‌ కంటే తాము ఏ మాత్రం తక్కువకాదని ఆటలో సత్తా చాటుతూ ఇండియన్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ అదరగొడుతుంది. గతంలో కంటే ఎంతో మెరుగ్గా రాణిస్తూ.. క్రికెట్‌ అభిమానులను తమ వైపు తిప్పుకుంటున్నారు. అయినా కూడా ఉమెన్‌ క్రికెటర్లకు కొన్నిచోట్ల అవమానాలు తప్పడంలేదు. తాజాగా ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు ఘోర అవమానం ఎదురైంది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత జట్టు.. తొలి వన్డేలో ఓటమి పాలైనా తిరిగి పుంజుకుని రెండో వన్డేలో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ జెమిమా రోడ్రిగ్స్ 86 పరుగులతో భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అలాగే బౌలింగ్‌లోనూ 4 వికెట్లతో సత్తా చాటింది. అలాగే కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సైతం 52 పరుగులతో రాణించింది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో టీమిండియా 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో వన్డేలో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్‌.

ఈ నేపథ్యంలో రెండో వన్డేలో విజయం తర్వాత జరిగిన పోస్ట్‌ మ్యాచ్‌ సెర్మనీలో విన్నింగ్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌తో ప్రజంటేటర్‌ మాట్లాడి.. చివర్లో ‘థ్యాంక్యూ వెరీమచ్‌ జెమియా’ అన్నాడు. దానికి షాకైన హర్మన్‌ ప్రీత్‌.. ‘హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌.. థ్యాంక్యూ’ అంటూ తన పేరు జెమియా కాదు, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అని గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా కెప్టెన్‌తో మాట్లాడుతూ.. ఆమె పేరును మర్చిపోవడం ఏంటని క్రికెట్ ఫ్యాన్స్‌ ఆగ్రహం ‍వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ మ్యాచ్‌లో జెమియా అద్భుత ప్రదర్శన చేయడంతో ఆమె పేరును పదేపదే పలకడంతో ప్రజంటేటర్‌ పొరపాటుగా అలా అన్నాడంటూ కొంతమంది లైట్‌ తీసుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తొలి రోజు టీమిండియాదే! అదరగొట్టిన జైస్వాల్‌, రోహిత్‌