iDreamPost
android-app
ios-app

వరల్డ్‌ కప్‌లో అదరగొడుతున్న షమీ గురించి స్పందించిన పోర్న్‌ స్టార్‌

  • Published Nov 04, 2023 | 1:49 PM Updated Updated Nov 04, 2023 | 6:03 PM

టీమిండియా స్టార్‌ బౌలర్‌ గురించి ఓ ప్రముఖ పోర్న్‌స్టార్‌ స్పందిస్తూ.. సూపర్‌ బౌలింగ్‌తో అదరగొడుతున్న షమీని మెచ్చుకుంటూ ఓ ట్వీట్‌కు రిప్లయ్‌ ఇచ్చింది. అయితే.. ఇప్పుడే గతంలో కూడా షమీ విషయంలో స్పందించింది ఆమె. మరి ఆమె ఎవరో? ఏమని స్పందించిందో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ బౌలర్‌ గురించి ఓ ప్రముఖ పోర్న్‌స్టార్‌ స్పందిస్తూ.. సూపర్‌ బౌలింగ్‌తో అదరగొడుతున్న షమీని మెచ్చుకుంటూ ఓ ట్వీట్‌కు రిప్లయ్‌ ఇచ్చింది. అయితే.. ఇప్పుడే గతంలో కూడా షమీ విషయంలో స్పందించింది ఆమె. మరి ఆమె ఎవరో? ఏమని స్పందించిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 04, 2023 | 1:49 PMUpdated Nov 04, 2023 | 6:03 PM
వరల్డ్‌ కప్‌లో అదరగొడుతున్న షమీ గురించి స్పందించిన పోర్న్‌ స్టార్‌

వన్డే వరల్డ్‌ కప్‌ లో టీమిండియా సూపర్‌ సక్సెస్‌ గా దూసుకెళ్తోంది. వరుసగా ఏడు విజయాలు సాధించిన టీమిండియా.. సగర్వంగా సెమీ ఫైనల్‌ లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఉంది రోహిత్‌ సేన. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ లాంటి పెద్ద టీమ్స్‌ తో పాటు ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి చిన్న టీమ్స్‌ ను చిత్తు చేసి.. వరల్డ్‌ కప్‌ సెమీస్‌ కి అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మొత్తంగా 14 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌ గా ఉంది. అయితే.. వరల్డ్‌ కప్‌ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న టీమిండియాకు.. షమీ జత కలవడంతో టీమ్ మరింత డేంజరస్‌ గా మారింది.

జట్టు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. షమీని ఆరంభంలో ఏకంగా నాలుగు మ్యాచ్‌ లు ఆడించలేదు. కానీ, వన్స్‌ షమీ టీమ్‌ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రదర్శన ఇస్తున్నాడో చూశాం. ఆడిన మూడు మ్యాచ్‌ ల్లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. రెండు మ్యాచ్‌ ల్లో 5 వికెట్ల హాల్‌ సాధించాడు. దీంతో టీమ్‌ లో షమీ ప్లేస్‌ పర్మినెంట్‌ అయిపోయింది. ఇప్పుడు షమీని పక్కన పెట్టే సాహసం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అస్సలు చేయడు. ప్రస్తుతం షమీ ఇస్తున్న అద్భుత ప్రదర్శనలతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా షమీ సూపర్‌ బౌలింగ్‌ కు ఓ ప్రముఖ పోర్న్‌ స్టార్‌ సైతం ఫిదా అయిపోయింది. అమెరికాకు చెందిన ప్రొఫెషనల్‌ పోర్న్‌ స్టార్‌ కేండ్రా లస్ట్‌ షమీ అద్భుత ప్రదర్శనను మెచ్చుకుంటూ.. లక్ష్మీ రతన్‌ శుక్లా అనే ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ కు చప్పట్లు కొడుతున్న ఎమోజీతో రిప్లయ్‌ ఇచ్చింది.

షమీ బౌలింగ్‌ పై ఆమె స్పందించడం ప్రస్తుతం విశేషంగా మారింది. సాధారణంగా అమెరికాలో క్రికెట్‌ కు అంత ఆదరణ ఉండదు. పైగా పోర్న్‌ స్టార్లు ఇతర విషయాలను పట్టించుకోవడం, పెద్దగా బయటికి రావడం లాంటివి చేయరు. అయితే.. కేండ్రా లస్ట్‌ మాత్రం సోషల్‌ మీడియాలో బాగా యాక్టీవ్‌ గా ఉంటుంది. ఇప్పుడు ఆమె షమీ గురించి స్పందించడంతో ఆ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది. ఇప్పుడే కాదు.. 2022 ఐపీఎల్‌ సమయంలో కూడా కేండ్రా, షమీ గురించి స్పందించింది. మరి ప్రముఖ పోర్న్‌ స్టార్‌ షమీని మెచ్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.