iDreamPost
android-app
ios-app

మోడల్‌ ఆత్మహత్య! పోలీసుల విచారణలో SRH స్టార్‌ క్రికెటర్‌

  • Published Feb 21, 2024 | 11:48 AM Updated Updated Feb 21, 2024 | 11:48 AM

Abhishek Sharma, Tania Singh: గుజరాత్‌కు చెందిన మోడల్‌ తానియా సింగ్‌ ఆత్మహత్య కేసులో భారత యువ క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న ఓ యువ క్రికెటర్‌ను పోలీసులు విచారణకు పిలిచారు. ఆ కేసు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Abhishek Sharma, Tania Singh: గుజరాత్‌కు చెందిన మోడల్‌ తానియా సింగ్‌ ఆత్మహత్య కేసులో భారత యువ క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న ఓ యువ క్రికెటర్‌ను పోలీసులు విచారణకు పిలిచారు. ఆ కేసు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 21, 2024 | 11:48 AMUpdated Feb 21, 2024 | 11:48 AM
మోడల్‌ ఆత్మహత్య! పోలీసుల విచారణలో SRH స్టార్‌ క్రికెటర్‌

గుజరాత్‌కు చెందిన ప్రముఖ మోడల్‌ తానియా సింగ్‌ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి సమయంలో ఇంటికి ఆలస్యంగా ఉన్న తానియా.. ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఆమె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు షాక్‌ అయ్యి.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసుల.. భారత యువ క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ సభ్యుడు అభిషేక్‌ శర్మను విచారణకు పిలిచారు. మోడల్‌ తానియా ఆత్మహత్య కేసులో ఈ యంగ్‌ క్రికెటర్‌ను గుజరాత్‌ పోలీసులు విచారణకు పిలవడంతో.. అతనికి ఆమె ఆత్మహత్యకు లింక్‌ ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంతకీ మోడల్‌ తానియా ఆత్మహత్య చేసుకుంటే.. క్రికెటర్‌ అయిన అభిషేన్‌ శర్మను ఎందుకు విచారణకు పిలిచారు? వాళ్లిద్దరికి లింక్‌ ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. తానియా, అభిషేక్‌ స్నేహితులు. ఇద్దరికీ చాలా కాలం పరిచయం ఉంది. వారిద్దరి మధ్య స్నేహం కారణంగానే.. పోలీసులు అభిషేక్‌ను కూడా విచారిస్తున్నారు. కానీ, ఈ మధ్య కాలంలో వారిద్దరు అంత క్లోజ్‌గా లేరని సమాచారం. అయినా కూడా ప్రాథమిక విచారణలో భాగంగా ఆమె స్నేహితులందరి విచారణలో భాగంగానే అభిషేన్‌ను కూడా పోలీసులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.

అయితే.. ప్రస్తుతం అభిషేక్‌ శర్మ రంజీ ట్రోఫీ ముగించుకుని, రాబోయే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో పంజాబ్‌ తరఫున ఆడిన అభిషేక్‌ శర్మ.. ఆ జట్టు గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటికి వెళ్లడంతో అభిషేక్‌ ఇక ఐపీఎల్‌పై దృష్టిపెట్టాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఓపెనర్‌గా అభిషేక్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం అభిషేక్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ రీటెన్‌ చేసుకుంది. అయితే.. ఇప్పుడు పోలీసులు విచారణకు ఆహ్వానించడంతో అభిషేక్‌.. క్రికెట్‌కు బ్రేక్‌ ఇచ్చి పోలీసులకు సహకరించాల్సి ఉంటుంది. మరి ఈ కేసులో అభిషేక్‌ను విచారించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.