వినేష్‌ ఫొగాట్‌ ఘటనపై.. ప్రధాని మోదీ ఎమోషనల్‌ ట్వీట్‌!

PM Modi, Vinesh Phogat: స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ ఒలింపిక్స్‌లో డిస్‌క్వాలిఫై అవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

PM Modi, Vinesh Phogat: స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ ఒలింపిక్స్‌లో డిస్‌క్వాలిఫై అవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ బాధను మాటల్లో చెప్పలేను, ఈ ఎదురుదెబ్బ చాలా బాధాకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. భారత స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో 50 కేజీల రెజ్లింగ్‌ పోటీ ఫైనల్స్‌కి ముందు ఆమెపై అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారతీయ క్రీడాభిమానుల హృదయాలు ముక్కలు అయ్యాయి. నిబంధనల ప్రకారం.. ఫైనల్స్‌కి ముందు నివేష్‌ ఫొగాట్‌ 100 గ్రాముల బరువు అధికగంగా ఉండటంతో ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.

‘వినేస్‌.. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్‌. ప్రతి భారతీయుడికి మీరు స్ఫూర్తి. దేశానికి గర్వకారణం. ఈ రోజు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధాకారం. ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. మీరు సవాళ్లుకు ఎదురు నిలుస్తారనే విషయం నాకు బాగా తెలుసు. అది స్వభావం. దీన్నుంచి మీరు పుంజుకుంటారని విశ్వసిస్తున్నాను. దేశం మొత్తం మీ వెంట ఉంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రధాని చేసిన ఈ కామెంట్స్‌.. చెప్పలేని దుఖఃలో ఉన్న వినేస్‌ ఫొగాట్‌కు కాస్త ఊరటనచ్చేలా ఉన్నాయి.

ఒలింపిక్స్‌ నిబంధనల ప్రకారం.. 50 కేజీల రెజ్లింగ్‌ ఈవెంట్‌లో పాల్గొనే వాళ్లు.. 50 లేదా అంతకంటే తక్కువ కేజీల బరువు ఉండాలి. అయితే.. ఫైనల్‌కి ఒక రోజు ముందు వినేష్‌ ఫొగాట్‌ 52 కేజీల బరువు ఉంది. అధికంగా ఉన్న 2 కేజీల బరువు తగ్గించుకునేందుకు.. మ్యాచ్‌కి ముందు రాత్రి ఎన్నో రకాల వ్యాయామాలు కూడా చేసింది వినేష్‌. కానీ, చివరికి లాభం లేకుండా పోయింది. మ్యాచ్‌కి ముందు బరువు కొలిచే సమయానికి 50 కేజీల 100 గ్రాముల బరువు ఉండటంతో.. వినేష్‌ను డిస్‌క్వాలిఫై చేశారు. అయితే.. బరువు తగ్గించుకునేందుకు ఒంట్లోని రక్తం కూడా తీయించుకుంది వినేష్‌. మరి వినేష్‌ డిస్‌క్వాలిఫై అవ్వడంతో పాటు.. ప్రధాని మోదీ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments