iDreamPost
android-app
ios-app

తమని రక్షించాలంటూ అశ్విన్‌ రిక్వెస్ట్‌! ఎందుకు? ఏమైందంటే..?

  • Published Apr 27, 2024 | 11:30 AM Updated Updated Apr 27, 2024 | 11:30 AM

Ravichandran Ashwin, KKR vs PBKS: టీమిండియా క్రికెటర్‌ రవిచం‍ద్రన్‌ అశ్విన్‌ తమను రక్షించాలంటూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ పెట్టాడు. అది క్షణాల్లో వైరల్‌ అయింది. అయితే అశ్విన్‌ అలా ఎందుకు పోస్ట్‌ పెట్టాడో ఇప్పుడు చూద్దాం..

Ravichandran Ashwin, KKR vs PBKS: టీమిండియా క్రికెటర్‌ రవిచం‍ద్రన్‌ అశ్విన్‌ తమను రక్షించాలంటూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ పెట్టాడు. అది క్షణాల్లో వైరల్‌ అయింది. అయితే అశ్విన్‌ అలా ఎందుకు పోస్ట్‌ పెట్టాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 27, 2024 | 11:30 AMUpdated Apr 27, 2024 | 11:30 AM
తమని రక్షించాలంటూ అశ్విన్‌ రిక్వెస్ట్‌! ఎందుకు? ఏమైందంటే..?

ఐపీఎల్‌ 2024లో ఎలాంటి విధ్వంసాలు నమోదు అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా భారీ భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. 11 ఏళ్లుగా చెక్కుచెదరని ఆర్సీబీ 263 పరుగుల స్కోర్‌ రికార్డును ఇప్పటికే ఈ సీజన్‌లో ఏకంగా నాలుగు సార్లు బ్రేక్‌ అయింది. అదే వింత అనుకుంటే.. శుక్రవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఏకంగా 262 పరుగులను ఛేజ్‌ చేసి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో జరుగుతున్న ఈ అద్భుతాలు, బద్దలవుతున్న భారీ రికార్డులు చూసి.. క్రికెట్‌ అభిమానులే కాదు, క్రికెట్‌ నిపుణులు, మాజీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఇదే విషయంపై టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా స్పందించాడు.

కేకేఆర్‌ వర్సెస్‌ పంజాబ్‌ బ్యాచ్‌లో నమోదైన స్కోర్లపై అశ్విన్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చాడు. ‘ఎవరైనా బౌలర్లను కాపాడండి’అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు మరో భారత స్పిన్నర్, రాజస్థార్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఆ దేవుడే కాపాడాలన్నా’అంటూ దండం పెడుతున్న ఏమోజీని జత చేశాడు. 262 పరుగుల లక్ష్యఛేదనలో చివరి రెండు ఓవర్లలో బాల్‌ ఏ రన్‌గా ఇక్వేషన్‌ మారడంపై అశ్విన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే మ్యాచ్‌ జరిగిన ఈడెన్ గార్డెన్స్‌లో బౌండరీల దూరం సాధారణమేనని వచ్చిన ఓ కామెంట్‌కు అశ్విన్‌ నవ్వుతున్న ఏమోజీలను షేర్ చేశాడు. ఇక విధంగా చెప్పాలంటే పిచ్‌లపై అశ్విన్‌ ఈ విధంగా వ్యంగ్యంగా స్పందించినట్లు క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో నమోదు అవుతున్న స్కోర్లపై క్రికెట్‌ అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం బ్యాటర్లకు అనుకూలంగా పిచ్‌లను మరీ ప్లాట్‌గా రూపొందిస్తున్నారని, బౌలర్లకు ఏ మాత్రమ హెల్ప్‌ దొరకడం లేదని అంటున్నారు. క్రికెట్‌ అంటే బ్యాటర్లకు, బౌలర్లకు మధ్య జరిగే ఫైట్‌ అని, అంతే కానీ.. రెండు టీమ్స్‌లోని బ్యాటర్ల మధ్య జరిగే యుద్ధం కాదని హితవు పలుకుతున్నారు. పిచ్‌లు ఫ్లాట్‌గా ఉండటం, బౌండరీ లైన్స్‌ చాలా దగ్గరగా ఉండటం, ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్స్ వల్లే ఇంత భారీ స్కోర్లు నమోదు అవ్వడం, ఛేజ్‌ అవ్వడం జరుగుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.