iDreamPost
android-app
ios-app

వేలంలో పట్టించుకోలేదు.. ఇప్పుడు ఫీలవుతున్నారు! మ్యాచ్ విన్నర్‌గా అన్‌సోల్డ్‌ ప్లేయర్‌!

  • Published Apr 30, 2024 | 11:30 AM Updated Updated Apr 30, 2024 | 11:30 AM

Philip Salt, KKR vs DC, IPL 2024: ఐపీఎల్‌ వేలంలో ఓ ఆటగాడిని ఏ ఫ్రాంచైజ్‌ కూడా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు అతనే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు మ్యాచ్‌ విన్నర్‌గా మారాడు. మరి ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Philip Salt, KKR vs DC, IPL 2024: ఐపీఎల్‌ వేలంలో ఓ ఆటగాడిని ఏ ఫ్రాంచైజ్‌ కూడా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు అతనే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు మ్యాచ్‌ విన్నర్‌గా మారాడు. మరి ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 30, 2024 | 11:30 AMUpdated Apr 30, 2024 | 11:30 AM
వేలంలో పట్టించుకోలేదు.. ఇప్పుడు ఫీలవుతున్నారు! మ్యాచ్ విన్నర్‌గా అన్‌సోల్డ్‌ ప్లేయర్‌!

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. సోమవారం కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 7 వికెట్ల తేడాతో డీసీని చిత్తుగా ఓడించింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో భారీ భారీ స్కోర్ల మ్యాచ్‌లు చూసిన క్రికెట్‌ అభిమానులకు కాస్త.. డిఫరెంట్‌ ఇక్స్‌పీరియన్స్‌ ఇస్తూ.. కేకేఆర్‌ వర్సెస్‌ డీసీ మ్యాచ్‌ లో స్కోర్‌ గేమ్‌గా సాగింది. ఈ మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. కానీ, కేకేఆర్‌ ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో డీసీ చేతులెత్తేసింది. పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉన్నా.. పిచ్‌తో సంబంధం లేకుండా తన టాలెంట్‌తో సాల్ట్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ను గెలిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సులతో 68 పరుగులు చేసి.. మ్యాచ్‌ను కేకేఆర్‌ చేతుల్లో పెట్టి అవుట్‌ అయ్యాడు.

అయితే.. నిజానికి ఈ ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం జరిగిన వేలంలో సాల్ట్‌ ఎవరు కొనుగోలు చేయలేదు. వేలంలో సాల్ట్‌ను కనీసం ఒక్క ఫ్రాంచైజ్‌ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఎవరూ కొనకుంటే కేకేఆర్‌లోకి ఎలా వచ్చాడని అనుకుంటున్నారా? కేకేఆర్‌ అదృష్టమో, మిగతా జట్ల దురదృష్టమో కానీ.. కేకేఆర్‌ ఓపెనర్‌ జెసన్‌ రాయ్‌ గాయంతో ఐపీఎల్‌ టోర్నీకి దూరం అయ్యాడు. అతనికి రీప్లేస్‌మెంట్‌గా కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌.. వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సాల్ట్‌ను టీమ్‌లోకి తీసుకోవాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే ఇప్పుడు కేకేఆర్‌కు మ్యాచ్‌లు గెలిపిస్తోంది. గౌతమ్‌ గంభీర్‌ రాకతో సునీల్‌ నరైన్‌ మరోసారి ఓపెనర్‌ అవతారం ఎత్తడంతో.. అతనికి జోడీగా ఫిలిప్‌ సాల్ట్‌ దుమ్మురేపుతున్నాడు. సాల్ట్‌ను వేలంలో ఎందుకు తీసుకోలేదా అని ఇప్పుడు చాలా టీమ్స్‌ ఫీల్‌ అవుతున్నాయి.

Unsold player at auction becomes KKR god!

ఈ సీజన్‌లో కేకేఆర్‌ పవర్‌ ప్లేలో అద్భుతంగా ఆడుతోంది. ఇప్పుటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆ జట్టు పవర్‌ ప్లేలో ఏకంగా 5 సార్లు 70కి పైగా రన్స్‌ చేసిందంటే.. ఆ జట్టు ఓపెనర్లు సునీల్‌ నరైన్‌, ఫిలిప్‌ సాల్ట్‌ ఏ విధంగా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నరైన్‌ గుడ్డిగా బ్యాటింగ్‌ చేసినా.. సాల్ట్‌ అలా కాదు.. ప్రాపర్‌ క్రికెటింగ్‌ షాట్స్‌తో చూడముచ్చటైన బ్యాటింగ్‌ చేస్తాడు. అదే స్థాయిలో వేగంగా కూడా ఆడతాడు. ఇన్ని రోజులు కేకేఆర్‌ ఏం మిస్‌ అయిందో.. సాల్ట్‌ చూపిస్తున్నాడు. వేలంలో అమ్ముడుపోకపోయినా.. కేకేఆర్‌కు ఆడాలని రాసి ఉండటంతో.. ఇప్పుడు ఆ జట్టుకు బ్యాటింగ్‌లో దేవుడిలా మారిపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సాల్ట్‌ 49.00 యావరేజ్‌, 180.65 స్ట్రైక్‌రేట్‌తో 392 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. బ్యాటర్‌గానే కాదు.. వికెట్‌ కీపర్‌గా కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరి వేలంలో అమ్ముడుపోని సాల్ట్‌ కేకేఆర్‌కు కొండంత బలం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.