iDreamPost
android-app
ios-app

పాక్‌ని ఓడించడమే కాక.. మ్యాచ్ అయ్యాక ఘోరంగా అవమానించిన ఐర్లాండ్ కెప్టెన్!

  • Published May 11, 2024 | 1:42 PM Updated Updated May 11, 2024 | 1:42 PM

Paul Stirling, PAK vs IRE: తమ దేశానికి వచ్చిన పాకిస్థాన్‌ టీమ్‌ను తొలి మ్యాచ్లోనే చిత్తుగా ఓడించడమే కాకుండా.. మ్యాచ్‌ తర్వాత మాటలతో కూడా దారుణంగా అవమానించాడు ఐర్లాండ్‌ కెప్టెన్‌. ఇంతకీ అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Paul Stirling, PAK vs IRE: తమ దేశానికి వచ్చిన పాకిస్థాన్‌ టీమ్‌ను తొలి మ్యాచ్లోనే చిత్తుగా ఓడించడమే కాకుండా.. మ్యాచ్‌ తర్వాత మాటలతో కూడా దారుణంగా అవమానించాడు ఐర్లాండ్‌ కెప్టెన్‌. ఇంతకీ అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published May 11, 2024 | 1:42 PMUpdated May 11, 2024 | 1:42 PM
పాక్‌ని ఓడించడమే కాక.. మ్యాచ్ అయ్యాక ఘోరంగా అవమానించిన ఐర్లాండ్ కెప్టెన్!

టీ20 వరల్డ్‌ కప్‌ ముందు పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌కు భారీ షాక్‌ తగిలింది. మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్‌.. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది ఐర్లాండ్‌. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజమ్‌ 43 బంతుల్లో 57, సైమ్‌ ఆయూబ్ 29 బంతుల్లో 45, ఇఫ్తికర్ అహ్మద్ 15 బంతుల్లో 37 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. రిజ్వాన్‌ 1, అజమ్‌ ఖాన్‌, షాదాబ్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యారు. ఐర్లాండ్‌ బౌలర్లలో యంగ్‌ రెండు వికెట్లతో సత్తా చాటాడు.

పాకిస్థాన్‌ నిర్దేశించిన 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐర్లాండ్‌ ఓపెనర్ ఆండ్రీవ్ బల్బర్నీ 77 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. హ్యారీ టెక్టర్ 36 పరుగులతో రాణించాడు. చివర్లో కాంప్ హెర్(15*), డెలానీ(10*) నాటౌట్ గా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత పాకిస్థాన్‌ జట్టు పరువు తీసేలా మాట్లాడాడు ఐర్లాండ్‌ కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌. తమ దేశానికి వచ్చిన పాకిస్థాన్‌ టీమ్‌ను తొలి మ్యాచ్‌లోనే ఓడించడమే కాకుండా.. మ్యాచ్‌ తర్వాత అతను చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇంతకీ స్టిర్లింగ్‌ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలోనే అత్యంత ఫ్లాట్‌ పిచ్‌లు కలిగిన పాకిస్థాన్‌ దేశం నుంచి మీరు ఇక్కడి వచ్చి.. ఆడేటప్పుడు.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేస్తే మీకు అర్థం అవుతుంది. మీరు ఏ మాత్రం ఆడగలరో అంటూ పాక్‌ టీమ్‌ పరువు తీశాడు స్టిర్లింగ్‌. పాకిస్థాన్‌లోని పిచ్‌లు ప్లాట్‌గా ఉండి.. బ్యాటింగ్‌ను అనుకూలంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఐర్లాండ్‌లో అలా కాదు.. ఇక్కడి పిచ్‌లు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. బౌన్స్‌, ఇంక స్వింగ్‌ లభిస్తుంది. ఇక్కడి పిచ్‌లపై ఆడితే.. బ్యాటర్ల అసలు సత్తా ఏంటో బయటపడుతుందని పాల్‌ ఉద్దేశం. ఈ మాట మ్యాచ్‌ గెలిచిన తర్వాత చెప్పడం ఇంకా హైలెట్‌. అప్పటికే మ్యాచ్‌ ఓడి బాధలో ఉన్న పాకిస్థాన్‌ టీమ్‌ను స్టిర్లింగ్‌ కామెంట్స్‌ మరింత బాధపెట్టి ఉంటాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.