SNP
Yusuf Pathan, Irfan Pathan, Brett Lee, WCL 2024: పఠాన్ బ్రదర్స్ సునామీలో ఆస్ట్రేలియా లెజెండ్స్ టీమ్ కొట్టుకొపోయింది. బ్రెట్ లీ అని చూడకుండా అన్నదమ్ములిద్దరు విధ్వంసం సృష్టించారు. ఆ పఠాన్ తుఫాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Yusuf Pathan, Irfan Pathan, Brett Lee, WCL 2024: పఠాన్ బ్రదర్స్ సునామీలో ఆస్ట్రేలియా లెజెండ్స్ టీమ్ కొట్టుకొపోయింది. బ్రెట్ లీ అని చూడకుండా అన్నదమ్ములిద్దరు విధ్వంసం సృష్టించారు. ఆ పఠాన్ తుఫాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఒకప్పుడు టీమిండియా తరఫున కలిసి ఆడుతూ అదరగొట్టిన పఠాన్ బ్రదర్స్.. యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్.. తాజాగా మరోసారి తమ సత్తా ఏంటో చూపించారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దుమ్మరేపారు. ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోస్తూ.. కేవలం 18 బంతుల్లో ఏకంగా 74 పరుగులు చేసి గ్రౌండ్‌లో సునామీ సృష్టించారు. ఈ విధ్వంసంతో ఇండియా ఛాంపియన్స్ టీమ్ ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. పైగా వాళ్లిద్దరూ కొట్టింది సాదాసీదా బౌలర్లని కాదు. బ్రెట్ లీ లాంటి దిగ్గజ బౌలర్‌ని.
ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. 16 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆ తర్వాత నుంచి మూడు ఓవర్ల పాటు పఠాన్ బ్రదర్స్ విధ్వంస సృష్టించారు. బ్రెట్ లీ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టిన ఇర్ఫాన్ పఠాన్ రెండో బంతికి సింగిల్ తీసి.. స్ట్రైక్ యూసుఫ్‌కి ఇచ్చాడు. అతను మూడో బంతికి రెండు పరుగుల కొట్టాడు. నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. కానీ, చివరి రెండు బంతుల్లో రెండు భారీ సిక్సులు బాదాడు. ఆ తర్వాతి ఓవర్ కౌల్టర్ నైల్ వేశాడు. ఓవర్‌లో ఇర్ఫాన్ పఠాన్ ఏకంగా నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో పాటు రెండు సిక్సులు ఒక నో బాల్‌తో మొత్తం 31 పరుగులు వచ్చాయి.
ఇక 19వ ఓవర్ వేసేందుకు మళ్లీ బ్రెట్ లీ వచ్చాడు. ఈ సారి యూసుఫ్ పఠాన్ వంతు. 4, 6, 4, 4, 4తో ఆ ఓవర్‌లో 23 పరుగులు రాబట్టాడు. ఇలా కేవలం 17, 18, 19.. మూడు ఓవర్లలోనే ఏకంగా 74 పరుగులు కొట్టారు ఈ అన్నదమ్ములు. వీరి తుఫాన్ ఇన్నింగ్స్‌లకు టీమిండియా స్కోర్ ఏకంగా 154కు చేరుకుంది. మొత్తంగా 36 బంతుల పార్ట్నర్‌షిప్‌లో 96 పరుగులు జోడించారు. యూసుఫ్ పఠాన్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 51, ఇర్ఫాన్ పఠాన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 50 పరుగులు చేసి అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ టీమ్ ఏకంగా 86 పరుగుల భారీ తేడాతో గెలిచి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో శనివారం రాత్రి తలపడనుంది ఇండియా ఛాంపియన్స్ టీమ్. మరి ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో పఠాన్ బ్రదర్స్ సృష్టించిన సునామీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.