iDreamPost
android-app
ios-app

క్వాలిఫైయర్‌-1లో సన్‌రైజర్స్‌ ఓటమికి కెప్టెన్‌ కమిన్సే కారణం! ఎలాగంటే..?

  • Published May 22, 2024 | 9:49 AM Updated Updated May 22, 2024 | 12:41 PM

Pat Cumminus, KKR vs SRH, Glenn Philips: ఐపీఎల్‌ 2024లో భాగంగా క్వాలిఫైయర్‌ 1లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమికి సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్సే కారణం అంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Pat Cumminus, KKR vs SRH, Glenn Philips: ఐపీఎల్‌ 2024లో భాగంగా క్వాలిఫైయర్‌ 1లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమికి సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్సే కారణం అంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 22, 2024 | 9:49 AMUpdated May 22, 2024 | 12:41 PM
క్వాలిఫైయర్‌-1లో సన్‌రైజర్స్‌ ఓటమికి కెప్టెన్‌ కమిన్సే కారణం! ఎలాగంటే..?

ఏ టెన్షన్‌ లేకుండా ఫైనల్స్‌కు వెళ్లాల్సిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఇప్పుడు క్వాలిఫైయర్‌-2లో తమ అదృష్టం పరీక్షించుకునే పరిస్థితి తెచ్చుకుంది. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో మంగళవారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్‌-1లో ఎస్‌ఆర్‌హెచ్‌ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. నేరుగా ఫైనల్‌ చేరుకునే అవకాశాన్ని సన్‌రైజర్స్‌ చేజార్చుకుంది. ఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచే టీమ్‌తో మరోసారి క్వాలిఫైయర్‌-2లో ఆడాల్సిన పరిస్థితి. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే ఎస్‌ఆర్‌హెచ్‌ ఫైనల్‌కు వెళ్తుంది. ఓడితే.. ఇంటికే. అయితే.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమికి కారణం ప్యాట్‌ కమిన్సే అనే విమర్శలు వినిపస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఈ సీజన్‌లో ప్యాట్‌ కమిన్స్‌ అద్భుతంగా నడిపించాడని మొన్నటి వరకు అంతా అతన్ని మెచ్చకున్నారు. కానీ, కేకేఆర్‌తో జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో కమిన్స్‌ ఒక్క సారిగా విలన్‌లా మారిపోయాడు. క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో సరైన ఫారెన్‌ ప్లేయర్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ బరిలోకి దిగలేదనే విమర్శలు వస్తున్నాయి. ట్రావిస్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ప్యాట్‌ కమిన్స్‌తో పాటు గ్లెన్‌ ఫిలిప్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాల్సిందని, అనవసరంగా విజయకాంత్ వియస్కాంత్‌ను ఆడించారని అంటున్నారు.  గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి స్టార్‌ ప్లేయర్‌ అందుబాటులో ఉన్నా.. కమిన్స్‌ అతన్ని బెంచ్‌కే పరిమితం చేశాడు.

ఫిలిప్స్‌ టీమ్‌లో ఉంటే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో టీమ్‌కు ఎంతో సపోర్టివ్‌గా ఉండేవాడు. అలాంటి స్టార్‌ ప్లేయర్‌ను టీమ్‌లోకి తీసుకోకుండా కమిన్స్‌ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. ఇదే విషయంపై క్రికెట్‌ అభిమానులు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్లెన్‌ ఫిలిప్స్‌ను తీసుకోకుండా కమిన్స్‌ చాలా పెద్ద తప్పు చేశాడని, అలాగే టాస్‌ గెలిచి.. తొలుత బౌలింగ్‌ ఎంచుకోకుండా, బ్యాటింగ్‌ ఎంచుకోవడం కూడా కమిన్స్‌ చేసిన మరో పొరపాటు అంటూ ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ కూడా అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.