SNP
Pat Cummins, Virat Kohli, SRH vs RCB: క్రికెట్ అభిమానులంతా ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్, కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Pat Cummins, Virat Kohli, SRH vs RCB: క్రికెట్ అభిమానులంతా ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్, కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో ఈ రోజు బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోగల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మన హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అది పరుగులు వరదలా మారింది. పైగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి విధ్వంసం సృష్టించిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడిన సమయంలో 40 ఓవర్లలో 549 పరుగులు నమోదు అయ్యాయి. దీంతో మళ్లీ ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కమిన్స్ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లిని నేను ఎంతో ఇష్టపడతాను. బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లో అతను చూపించే కమిట్‌మెంట్ అద్భుతంగా ఉంటుంది. ఏడాదిలో 100 రోజులు క్రికెట్ ఆడితే.. ప్రతి రోజు అతను ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కోహ్లీలో ఉండే పోటీతత్వం నాకు ఇష్టం. అలాగే మైదానంలో లోపల ఎంత పోటీతత్వంతో ఉంటాడో, గ్రౌండ్ బయట అంతే రిలాక్స్‌గా ఉంటాడు. ఈ విషయంలో నేను కోహ్లీ సేమ్’ అంటూ కమిన్స్ పేర్కొన్నాడు. కాగా, ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంటే ముందు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోహ్లీ దగ్గరికి వెళ్లి కలిసిన కమిన్స్, పిచ్ ప్లాట్‌గా ఉంది అంటూ కోహ్లీతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు.
కాగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ గ్రౌండ్‌లో చివరి సారిగా గతేడాది మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కేవలం 62 బంతుల్లోనే సెంచరీ చేసి.. అదరగొట్టాడు. ఈ సీజన్‌లో కూడా కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే 42 పరుగులు చేసి అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ముందు ఎస్‌ఆర్‌హెచ్ ఏకంగా 288 పరుగుల టార్గెట్‌ను పెట్టింది. ఈ టార్గెట్‌ను చేరుకోవడంతో ఆర్సీబీ వెనుకబడింది. కానీ, కోహ్లీ ఇచ్చిన స్టార్ట్‌తో 262 పరుగులు చేసి.. మంచి కాంపిటీషన్ ఇచ్చింది. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. మరి కోహ్లీ గురించి కమిన్స్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pat Cummins said “I admire Virat Kohli how much he gets into contest, with bat & in field – if he plays 100 days in a year, he will be up for every single day, he is super competitive – off the field, he is very relaxed, I am also the same”. [Star Sports] pic.twitter.com/iz6CLRprNz
— Johns. (@CricCrazyJohns) April 25, 2024