iDreamPost
android-app
ios-app

ఫైనల్లో కోహ్లీ అవుట్‌! స్టీవ్‌ స్మిత్‌ ఏమన్నాడో బయటపెట్టిన కమిన్స్‌

  • Published Nov 28, 2023 | 6:27 PM Updated Updated Nov 28, 2023 | 6:27 PM

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఫైనల్‌లో విరాట్‌ కోహ్లీ అవుటైన సమయంలో స్టేడియం మొత్తం సైలెంట్‌ అయిపోయింది. ఆ టైమ్‌లో ఆసీస్‌ టీమ్‌ మధ్య ఏం జరిగిందో ప్యాట్‌ కమిన్స్‌ వెల్లడించాడు. అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఫైనల్‌లో విరాట్‌ కోహ్లీ అవుటైన సమయంలో స్టేడియం మొత్తం సైలెంట్‌ అయిపోయింది. ఆ టైమ్‌లో ఆసీస్‌ టీమ్‌ మధ్య ఏం జరిగిందో ప్యాట్‌ కమిన్స్‌ వెల్లడించాడు. అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 28, 2023 | 6:27 PMUpdated Nov 28, 2023 | 6:27 PM
ఫైనల్లో కోహ్లీ అవుట్‌! స్టీవ్‌ స్మిత్‌ ఏమన్నాడో బయటపెట్టిన కమిన్స్‌

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఎదురైనా ఓటమి భారత క్రికెట్‌ అభిమానులను ఇంకా వేధిస్తూనే ఉంది. చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఆ ఓటమిని మర్చిపోలేక.. బాధపడుతున్నారు. వరుసగా పది మ్యాచ్‌లు ఆడి.. ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్లో అడుగుపెట్టిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై చతికిలపడింది. ఏ జట్టునైతే టోర్నీ ఆరంభంలో తొలి మ్యాచ్‌లోనే ఓడించిందో ఆ జట్టుతోనే ఫైనల్‌ ఆడిన భారత్‌.. విజయం సాధించలేకపోయింది. ఫైనల్స్‌ ఆడాలంటే తమ తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపిస్తూ.. ఆస్ట్రేలియా ఏకంగా ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఓటమితో పాటు ఫైనల్‌ కంటే ముందు కమిన్స్‌ చేసిన కామెంట్‌ కూడా ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఎక్కువగా బాధపెడుతోంది.

ఇండియాతో ఫైనల్‌ కంటే ముందు కమిన్స్‌ ఒక కామెంట్‌ చేశాడు.. ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చే లక్ష మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానులను మౌనంగా ఉంచుతామని అన్నాడు. అన్నట్లుగానే.. ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియాను డామినేట్‌ చేస్తూ.. భారత క్రికెట్‌ అభిమానులను సైలెంట్‌గా ఉంచింది ఆస్ట్రేలియా జట్టు. టీమ్‌ మంచి ప్రదర్శన చేయకుంటే.. అభిమానులు మాత్రం ఎలా సంతోషంతో కేరింతలు కొడతారు. ముఖ్యంగా కోహ్లీ వికెట్‌ పడిన సమయంలో మాత్రం స్టేడియంలో మొత్తం మౌనం ఆవహించింది. పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌గా మారిపోయింది.

ఇదే విషయంపై తాజాగా మరోసారి ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్పందించాడు. వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. స్వదేశానికి వెళ్లిన కమిన్స్‌ ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతనితో పాటు మిచెల్ స్టార్క్‌ సైతం ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేసిన తర్వాత స్టేడియంలోని ప్రేక్షకులంతా మౌనంగా కూర్చిండిపోయారని, ఆ సమయంలో టీమ్‌ హుడిల్‌లో స్టీవ్‌ స్మిత్‌ మాట్లాడుతూ.. చూడండి.. స్టేడియం మొత్తం ఎలా మూగబోయిందో.. ఒక్క క్షణం మరి వారి గోలను ఆపేశాం.. స్టేడియం లైబ్రరీలా మారిపోయింది అంటూ తమతో చెప్పినట్లు కమిన్స్‌ వెల్లడించాడు. ప్రస్తుతం కమిన్స్‌ ఈ వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడిప్పుడే ఓటమి బాధ నుంచి బయటపడుతున్న భారత క్రికెట్‌ అభిమానులకు పాత గాయన్ని గుర్తు చేసినట్లు అయింది. మరి కమిన్స్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.