SNP
భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూపులకు ఎడ్‌కార్డ్ పడే సమయం వచ్చేసింది. వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు టాస్ పడిపోయింది. అయితే.. రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడంతో.. అభిమానులు నిరాశపడుతున్నారు. కానీ, ఇలాంటి సీన్ 2003లో కూడా జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూపులకు ఎడ్‌కార్డ్ పడే సమయం వచ్చేసింది. వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు టాస్ పడిపోయింది. అయితే.. రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడంతో.. అభిమానులు నిరాశపడుతున్నారు. కానీ, ఇలాంటి సీన్ 2003లో కూడా జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ మొదలైపోయింది. ఈ మెగా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా టాస్ ఓడిపోవడంతో భారత క్రికెట్ అభిమానులంతా కాస్త నిరాశకు గురయ్యారు. అయితే.. ఇందులో కంగారు పడాల్సిన పనిలేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో టాస్ అంత కీలకం కాదు. ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా పెద్దగా ఫరక్ పడదు. ఇప్పుడు భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తుండటంతో ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఫ్రీగా బ్యాటింగ్ చేయవచ్చు. అయితే.. ఈ టాస్ ఓడిపోవడం టీమిండియాకే ఒక రకంగా కలిసొచ్చేలా ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియాతోనే తలపడిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్‌లో అప్పటి భారత కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ టాస్ గెలిచి.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఎంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి, ఏ మాత్రం ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేసి.. భారత్ ముందు 359 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఒత్తిడిలో ఆ టార్గెట్‌ను ఛేదించలేక టీమిండియా ఓటమి పాలైంది. అప్పుడు గంగూలీ ముందు బ్యాటింగ్ ఎంచుకుని ఉంటే బాగుండేదని ఇప్పటికీ చాలా మంది క్రికెట్ అభిమానులు బాధపడుతుంటారు.
కాగా, అప్పుడు దాదా చేసిన తప్పే.. ఇప్పుడు కమిన్స్ కూడా చేశాడా? అని చాలా మంది భావిస్తున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ముందుగా బ్యాటింగ్ చేయకుండా.. ఫీల్డింగ్‌కు దిగడం కమిన్స్ తీసుకున్న రాంగ్ డిషిషన్‌గా చాలా మంది భావిస్తున్నారు. అయితే.. టీమిండియా 1983, 2011లో వరల్డ్ కప్స్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ రెండు ఫైనల్స్‌లోనూ భారత్ టాస్ ఓడిపోయింది. కానీ, మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
1983 – India lost the toss and won the Final.
2011 – India lost the toss and won the Final.
2023 – India lost the toss…!!! pic.twitter.com/sxfC2x40Ge
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023