SNP
Pat Cummins, Australia vs Oman, T20 World Cup 2024: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ డ్రింక్స్ బాయ్‌గా మారాడు. ఆసీస్ వర్సెస్ ఒమన్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే.. ఇదే పరిస్థితి టీమిండియాలో జరిగి ఉంటే.. ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
Pat Cummins, Australia vs Oman, T20 World Cup 2024: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ డ్రింక్స్ బాయ్‌గా మారాడు. ఆసీస్ వర్సెస్ ఒమన్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే.. ఇదే పరిస్థితి టీమిండియాలో జరిగి ఉంటే.. ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో క్రికెట్ అభిమానులు ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంది. బుధవారం(వెస్టిండీస్ కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తాడు. క్రికెటర్లు డ్రింక్స్ మోయడం పెద్ద విషయం కాకపోయినా.. సరిగ్గా ఆరు నెలల క్రితం దేశానికి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్, అంతకంటే కొన్ని నెలల ముందే ఆస్ట్రేలియాను డబ్ల్యూటీసీ(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్)లో విజేతగా నిలిపిన కెప్టెన్ ఇప్పుడు డ్రింక్స్ అందిస్తుండటంతో భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఇటీవల ఐపీఎల్‌లో కూడా కమిన్స్ సూపర్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. సన్‌రైజర్స్ హైరదాబాద్‌ను ఫైనల్ వరకు చేర్చాడు. ఇవన్నీ చూసిన భారత క్రికెట్ అభిమానులు కమిన్స్‌ను డ్రింక్స్ బాయ్‌గా చూడలేకపోతున్నారు.
అయితే.. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే.. వాళ్లు ప్లేయర్‌ను ప్లేయర్‌లానే చూస్తారు. కానీ, మన దేశంలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒక ఆటగాడిని నెత్తిన పెట్టుకుంటాం. ఇప్పుడు కమిన్స్ విషయంలో జరిగింది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయం జరిగి ఉంటే పెద్ద రచ్చ జరిగేది. రోహిత్, కోహ్లీ కూడా డ్రింక్స్ మోసిన వాళ్లే కానీ, అప్పటి పరిస్థితి వేరు. ఇదే రోహిత్ శర్మ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో, వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో టీమిండియా గెలిచి.. ఛాంపియన్‌గా అవరతించి ఉంటే.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి.. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకుండా డ్రింక్స్ మోయిస్తే.. వామ్మో ఊహిస్తేనే ఎలానో ఉంది కదా. కానీ, ఆసీస్‌లో ఇది చాలా కామన్. ఎందుకీ తేడా అంటే..
వాళ్లు గేమ్‌ను ఏది అవసరమో అది చూస్తారు. టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయిన కమిన్స్‌కు టీ20 కెప్టెన్సీ ఇవ్వలేదు. మిచెల్ మార్ష్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అది కూడా ఎప్పుడూ.. కమిన్స్ 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచి, వన్డే వరల్డ్ కప్ 2023లో ఆసీస్‌ను ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత. కెప్టెన్‌గా ఇంత సక్సెస్ చూసిన తర్వాత టీ20 కెప్టెన్సీ ఇవ్వకుంటే.. టీమిండియాలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తిగత స్టార్ డమ్ మన ఇండియన్ క్రికెట్‌లో డామినేట్ చేస్తుంది. అది ఆస్ట్రేలియా క్రికెట్‌లో అస్సలు ఉండదు. ఇదే ఆసీస్ అంత సక్సెస్ అవ్వడానికి ఒక కారణం అని కూడా కొంతమంది అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
World Cup & WTC winning Captain Pat Cummins giving drinks to the players during the Oman match. 👏 pic.twitter.com/GyvAmwC1dG
— Johns. (@CricCrazyJohns) June 6, 2024