SRH vs RR: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను గెలిపించిన అసలు హీరో ఇతనే!

SRH vs RR: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను గెలిపించిన అసలు హీరో ఇతనే!

Pat Cummins, SRH vs RR, IPL 2024: రాజస్థాన్‌ రాయల్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌.. ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఈ విజయానికి అసలు కారణమైన ప్లేయర్‌ పేరు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఆ రియల్‌ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

Pat Cummins, SRH vs RR, IPL 2024: రాజస్థాన్‌ రాయల్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌.. ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఈ విజయానికి అసలు కారణమైన ప్లేయర్‌ పేరు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఆ రియల్‌ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఈ సీజన్‌లో నిన్నటి వరకు కేవలం ఒకే ఒక్క ఓటమి 8 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద ఊహించని షాకిచ్చింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో నితీష్‌ కుమార్‌ రెడ్డి, ట్రావిస్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ రాణించడం, బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ తన క్లాస్‌ను మరోసారి చూపించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ గెలిచింది అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. కానీ, రాజస్థాన్‌తో మ్యాచ్‌లో నిజానికి సన్‌రైజర్స్‌ ఓడిపోవాల్సింది, కానీ.. ఓ ఎక్స్‌పీరియన్స్‌ ప్లేయర్‌ చేసిన అద్భుతంతో ఒక్క పరుగుత తేడాతో సూపర్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. మరి ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రియాల్‌ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 14 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి.. 143 పరుగుల చేసేసింది. మ్యాచ్‌ గెలవాలంటే.. మరో 6 ఓవర్లలో కేవలం 59 పరుగులు మాత్రమే అవసరం. ఆ టైమ్‌లో 15వ ఓవర్‌ వేసిన జయదేవ్‌ ఉనద్కట్‌ ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టార్గెట్‌ మరింత చిన్నదైపోయింది. అప్పటికే క్రీజ్‌లో రియాన్‌ పరాగ్‌, హెట్‌మేయర్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. పైగా డీప్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న టీమ్‌ కావడంతో.. అంతా రాజస్థాన్‌దే మ్యాచ్‌ అనుకున్నారు. చాలా మంది ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు.. ఫోన్లు, టీవీలు బంద్‌ పెట్టేశారు ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోతుందని. కానీ, ఆ టైమ్‌లో బాల్‌ అందుకున్నాడు.. కెప్టెన్‌ కమిన్స్‌.

16వ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి.. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడుతున్న రియాన్‌ పరాగ్‌ను అవుట్‌ చేసి.. మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ వైపు తిప్పాడు. కానీ, ఆ ఓవర్‌ తర్వాత 17వ ఓవర్‌ వేసిన మార్కో జాన్సెన్‌ ఏకంగా 15 పరుగులు ఇ‍వ్వడంతో మ్యాచ్‌ మళ్లీ మలుపు తిరిగింది. 18వ ఓవర్‌ వేసిన టీ నటరాజన్‌ 7 పరుగులే ఇచ్చి.. కాస్త పర్వాలేదనిపించాడు. ఆ వెంటనే మరో సారి బంతి అందుకున్న ప్యాట్‌ కమిన్స్‌.. ఈ సారి కూడా మ్యాజిక్‌ రిపీట్‌ చేశాడు. తొలి బంతికే ధృవ్‌ జురెల్‌ను అవుట్‌ చేసి.. కీలకమైన 19వ ఓవర్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి.. చివరి ఓవర్‌లో డిఫెండ్‌ చేసుకోవడానికి భువీకి 12 రన్స్‌ ఉంచాడు. ఆ తర్వాత చివరి ఓవర్‌లో భువీ 11 రన్స్‌ ఇచ్చినా.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక రన్‌ తేడాతో గెలిచింది. ఈ విజయంలో కమిన్స్‌ వేసిన 16, 19వ ఓవర్‌ ఎంతో కీలకంగా మారాయి. ఆ ఓవర్స్‌లో కమిన్స్‌ కేవలం 3, 7 రన్స్‌ ఇవ్వడంతోనే రాజస్థాన్‌ ఓడిపోయింది. అలాగే నటరాజన్‌ కూడా 18వ ఓవర్‌ అద్భుతంగా వేయడం కలిసొచ్చింది. మరి రాజస్థాన్‌పై సూపర్‌ బౌలింగ్‌తో రియల్‌ హీరోగా నిలిచిన కమిన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments