iDreamPost
android-app
ios-app

Manu Bhaker: మను బాకర్ నెట్‌వర్త్ ఎంతంటే? అందంలోనే కాదు.. సంపాదనలోనూ క్వీన్!

  • Published Jul 29, 2024 | 3:28 PM Updated Updated Jul 29, 2024 | 3:28 PM

Paris Olympics 2024-Manu Bhaker, Net Worth Details: పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో.. పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను బాకర్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమెకు సంబంధించిన ఆసక్తికర వివరాలు మీ కోసం..

Paris Olympics 2024-Manu Bhaker, Net Worth Details: పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో.. పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను బాకర్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమెకు సంబంధించిన ఆసక్తికర వివరాలు మీ కోసం..

  • Published Jul 29, 2024 | 3:28 PMUpdated Jul 29, 2024 | 3:28 PM
Manu Bhaker: మను బాకర్ నెట్‌వర్త్ ఎంతంటే? అందంలోనే కాదు.. సంపాదనలోనూ క్వీన్!

క్రీడారంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఒలింపిక్స్‌ ప్రారంభం అయ్యాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలు ఈ సారి ఫ్యాషన్‌ నగరి పారిస్‌ కేంద్రంగా జరుగుతున్నాయి. భారత్‌ నుంచి 117 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో తమ సత్తా చాటేందుకు పారిస్‌ వెళ్లారు. ఇప్పటికే పలు క్రీడాంశాల్లో పోటీలు అయిపోయాయి. ఇక ఈ సారి ఒలింపిక్స్‌లో భారత్‌ తన ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టర్‌ ఈవెంట్‌లో భారత ముద్దు బిడ్డ మనుబాకర్‌ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌ చరిత్రలో షూటింగ్‌లో.. పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను బాకర్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఒలింపిక్స్‌లో అనగా 2020లో సుమారు 20 నిమిషాల పాటు ఆమె గన్‌ పని చేయలేదు. దాంతో నిష్క్రమించాల్సి వచ్చింది. కట్‌ చేస్తే.. నాలుగేళ్ల తర్వాత.. భారత్‌ నుంచి మహిళల షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

ఒలింపిక్స్‌లో మను సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా.. ఇతర నాయకులు, సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె సాధించిన విజయం పట్ల శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ.. మనుబాకర్‌కు ప్రత్యేకంగా కాల్‌ చేసి.. ఆమెని అభినందించారు. ఈ ఒలింపిక్స్‌ ఫైనల్లో మను బాకర్‌ 221.7 పాయింట్లు సాధించి.. కాంస్యం గెలిచింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. అతి చిన్న వయసులోనే అనగా కేవలం 22 ఏళ్ల వయసులోనే ఆమె ఈ రికార్డ్‌ సాధించింది. ఇక ఒలింపిక్స్‌లో మెడల్‌ గెలిచిన తర్వాత మీడియా, సోషల్‌ మీడియా ఇలా ఎక్కడ చూసిన మను బాకర్‌ పేరు మార్మోగి పోతుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అవి మీకోసం..

పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్యంతో పాటు గతంలో.. కూడా మను బాకర్‌ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిచింది. 2018లో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పతకం అందించింది. ఆ తర్వాత ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌తో పాటు కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా పతకాలు గెలిచింది. అవే కాక 22 ఏళ్లకే కోటీశ్వర్రాలైంది. మీడియా నివేదికల ప్రకారం.. మను బాకర్‌ టోర్నమెంట్ల ద్వారా వచ్చిన డబ్బు, ప్రైజ్‌ మనీ, ఎండార్సమెంట్లు, స్పాన్సర్‌షిప్‌లతో కలిపి భారీ మొత్తం అందుకుంది. టోటల్‌గా చూస్తే ఆమె ఆస్తి నికర విలువ 12 కోట్ల రూపాయలు అందుకుంది. అంతేకాక మన దేశంలో షూటింగ్‌ పోస్టర్‌ గర్ల్‌గా మారింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకం సాధించినందుకు గాను హర్యానా ప్రభుత్వం మను బాకర్‌ని సత్కరించడమే కాక.. రూ.2 కోట్లు అందజేసింది.

ఇక ప్రైజ్‌మనీ విషయం పక్కకు పెడితే.. మనబాకర్‌కి సోషల్‌ మీడియాలో చాలా మంచి పాపులారిటీ ఉంది. ఇన్‌స్టాలో ఆమెను సుమారు 2 లక్షల మంది ఫాలో చేస్తుండగా.. ట్విట్టర్‌లో సుమారు 1.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక మనుబాకర్‌కు ట్రైనింగ్‌ ఇప్పించడం కోసం ప్రభుత్వం ఆమె మీద సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. ట్రైనింగ్‌ కోసం ఆమెని స్విట్జర్లాండ్‌, జర్మనీ పంపాము అని వెల్లడించారు. ఆమె విజయం పట్ల ఎంతో గర్వపడుతున్నాం అన్నారు.